Begin typing your search above and press return to search.

వీడియో కాన్ఫరెన్స్ లోనే వార్నింగ్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   9 Jun 2016 11:27 AM IST
వీడియో కాన్ఫరెన్స్ లోనే వార్నింగ్ ఇచ్చారు
X
"హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తాం అంటే కుదరదు. ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంటుందో మీరు అక్కడే ఉండాలి. అందరిమీదా విచారణ జరుగుతుంది. రిపోర్ట్ చేతికి అందగానే సంబంధిత అధికారుల మీద చర్యలు తప్పవు" అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు వార్నింగ్ ఇచ్చారు. మిషన్ కాకతీయ పనుల వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పని చేస్తున్న చోట నివాసం ఉండని ఇంజీనీర్ల పేర్లను వీడియో కాన్ఫరెన్స్ లోనే చదివి వినిపించడం విశేషం. పేర్లు చదివిన అధికారులు అందరికీ ఒక నెల హెచ్ఆర్ఎ (హౌస్ రెంట్ అలవెన్స్) కట్ చేయాలని హరీష్ రావు ఆదేశించడం గమనార్హం.ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అదికారులు అప్రమత్తంగా ఉండి చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం చెరువుల మరమ్మతు పనులను తొందరగా పూర్తి చేస్తే .. ఈ సారి భారీ వర్షాలు వస్తాయి అన్న వార్తల నేపథ్యంలో చెరువులన్నీ నిండుతాయని భావిస్తోంది. అందుకే అదికారుల మీద తీవ్ర వత్తిడి తెస్తోంది. ఇప్పటికే వరంగల్ ఎస్ఈని ఇంటికి పంపిన మంత్రి హరీష్ రావు కిందిస్థాయి ఇంజనీర్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.