Begin typing your search above and press return to search.
క్రికెట్ లో హరీశ్ రావు కెప్టెన్ ఇన్నింగ్స్ !
By: Tupaki Desk | 3 Dec 2020 12:30 PM ISTతెలంగాణ రాజకీయాల్లో ఆయనో ఓ ట్రబుల్ షూటర్..తనకి అప్పగించిన బాధ్యతను , తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే నాయకుడు మంత్రి హరీష్ రావు. అయితే , అయన గురించి చాలామందికి తెలియని విషయమేంటంటే బ్యాట్ పడితే ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో పరుగుల వరద పారించగలడు. ప్రతిక్షణం లో రాజకీయాల్లో బిజిబిజీగా ఉండే హరీష్ రావు బుధవారం ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో క్రికెటర్ అవతారమెత్తి పరుగుల వరద పారించారు.
గత కొన్ని రోజులుగా గ్రేటర్ ఎన్నికల హడావిడిలో ఉన్న మంత్రి హరీష్ రావు ఆటవిడుపు గా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. సిద్దిపేటలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనడంతోపాటు సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వహించారు. సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్ , హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తన టీమ్ 3వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీష్ రావు బ్యాటింగ్ తో గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు.
గ్రౌండ్ లో ఎంటర్ అవుతూనే బంతిని బౌండరీ ల వైపు పరుగులు పెట్టించారు. 4 బంతుల్లో మూడు ఫోర్లు కొట్టారు. వికెట్ల మధ్య కూడా రన్నింగ్ బాగా చేశారు. మొత్తంగా 12 బాల్స్ లో 18 పరుగులు చేసి ఔటయ్యారు. హరీశ్ రావు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు, ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. క్రీజ్‌లో కొద్దిసేపు ఉన్నా కూడా 150 సగటుతో బ్యాటింగ్ చేసిన హరీశ్ రావు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు రాజకీయాల్లోనే కాదు,మైదానంలోనూ అదరగొట్టగలడని చెప్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.