Begin typing your search above and press return to search.
కేసీఆర్ వాట్సాప్.. అంత యాక్టివా?
By: Tupaki Desk | 26 Jun 2016 11:04 PM ISTముఖ్యమంత్రి బాధ్యతల్లో తలమునకలై ఉన్నవాడికి ఫోన్ తీసుకుని కాల్ మాట్లాడ్డానికే తీరిక ఉండదనుకుంటాం. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఏకంగా వాట్సాప్ వాడతారట. అంతే కాదు.. రెగ్యులర్ గా అందులో అప్ డేట్స్ చూసుకుని.. ఏవైనా కంప్లైంట్లు వస్తే ఫాలోఅప్ చేసి సమస్యల్ని పరిష్కరించడానికి అధికారుల్ని పురమాయిస్తారట. ఈ సంగతి స్వయంగా కేసీఆర్ మేనల్లుడు.. మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
కేసీఆర్ వాట్సప్ లో వచ్చే మేసేజుల విషయంలో చాలా అలెర్టుగా ఉంటారని.. వాట్సాప్ ద్వారా తన దృష్టికి ఏవైనా సమస్యలు వస్తే మంత్రుల్ని.. అధికారుల్ని పరుగులు పెట్టించి మరీ పనులు చేయిస్తారని చెప్పారు హరీష్. తన దృష్టికి వచ్చే ఏ అంశం మీద అయినా ఆయనకు ఫాలో అప్ ఎక్కువని.. పని పూర్తి అయ్యే వరకూ వెంటాడతారని అన్నారు హరీష్.
మొత్తానికి కేసీఆర్ వాట్సాప్ వాడటమే కాక.. అందులో చాలా యాక్టివ్ గా ఉంటారని.. ఏవైనా సమస్యల ప్రస్తావన తెచ్చినా స్పందిస్తారని హరీష్ మాటల ద్వారా అర్థమైంది. ఒకసారి ఆ వాట్సాప్ నంబరేదో పబ్లిగ్గా అనౌన్స్ చేసేస్తే బెటరేమో. ఇకపై జనాలంతా తమ సమస్యల్ని నేరుగా కేసీఆర్ కే విన్నవిస్తారు. ఆయన పరిష్కరించేస్తారు. ఎలా ఉంది ఐడియా?