Begin typing your search above and press return to search.

జైల్లో ఉన్న హార్దిక్ పటేల్ ఆరోగ్యం విషమం?

By:  Tupaki Desk   |   20 Feb 2016 11:31 AM IST
జైల్లో ఉన్న హార్దిక్ పటేల్ ఆరోగ్యం విషమం?
X
ఓ పక్క జాట్లు తమ రిజర్వేషన్ల కోసం రోడ్ల మీదకు రావటం హర్యానాలో పరిస్థితి ఆగమాగం కావటం తెలిసిందే. మరోవైపు గుజరాత్ లో పటేల్ వర్గీయుల రిజర్వేషన్లకు గళం విప్పి.. గుజరాత్ సర్కారునే కాదు.. కేంద్ర సర్కారును సైతం గడగడలాడించిన హార్దిక్ పటేల్ ప్రస్తతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన డిమాండ్ల సాధన కోసం జైల్లో ఉన్న హార్దిక్ పటేల్ నిరసన దీక్ష చేపట్టారు.

ఎలాంటి ఆహారాన్ని ముట్టని ఆయన తీరుతో.. ప్రస్తుతం హార్దిక్ ఆరోగ్యం విషమంగా మారింది. లాజ్ పూర్ జైల్లో దీక్ష చేస్తున్న హార్దిక్ పటేల్ ఆరోగ్యం విషమించటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ లోని పటేళ్ల సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరిలోకి చేర్చాలన్న డిమాండ్ తో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న హార్దిక్ తీరు ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడేసిందని.. ప్రస్తుతం ఆయన కోలుకునేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కులాల ఇష్యూతో పలు రాష్ట్ర సర్కార్లు కిందామీదా పడుతున్న వేళ.. హార్దిక్ పటేల్ ఆరోగ్యంలో ఏ చిన్న తేడా వచ్చినా మరో ఉపద్రవం ముంచుకురావటం ఖాయమని చెబుతున్నారు. కులాల రిజర్వేషన్ల మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.