Begin typing your search above and press return to search.

విదేశీ విమాన సర్వీసులకి గ్రీన్ సిగ్నల్..ఎప్పటినుండంటే!

By:  Tupaki Desk   |   23 May 2020 4:00 PM GMT
విదేశీ విమాన సర్వీసులకి గ్రీన్ సిగ్నల్..ఎప్పటినుండంటే!
X
కేంద్ర ప్రభుత్వం... అతి త్వరలో... విదేశీ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు ..పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్. దేశంలో వైరస్ కేసులు అదుపులోకి వచ్చిన పక్షంలో జూన్ రెండో వారం నుంచి గానీ, జులై నుంచి గానీ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావచ్ఛునని అయన తెలిపారు. ఒకవేళ, అప్పటికి కుదరకపోతే, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభం కాకపోతే, ఆగస్టు లేదా సెప్టెంబరుకి ముందు అంతర్జాతీయ పౌర విమానయాన కార్యకలాపాల ప్రారంభానికి ప్రయత్నిస్తామని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన విమానాలను పునరుధ్ధరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అన్నీ అనుకూలించిన పక్షంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి జులై లేదా ఆగస్టు వరకు ఎందుకు వేచి ఉండాలని ప్రశ్నించారు. ఈ వైరస్ తో మనం సహజీవనానికి అలవాటు పడితే.. మనం అనుకున్నట్టు ఈ కేసులు కంట్రోల్ అయిన పక్షంలో .. ఇక విమానాల పునరుధ్ధరణ ఏర్పాట్లకు సిధ్ధంగా ఉన్నాం అని ఆయన చెప్పారు.

కాగా-సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను పునరుద్జరిస్తున్నట్టు హర్ దీప్ సింగ్ పురి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తమిళనాడు, మహారాష్ట్రలు విమాన సర్వీసుల ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే కేంద్రం అన్ని ప్రాంతాలకు దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతాయని పునరుద్ఘాటించింది. అరోగ్యవంతులైన వృద్ధులను ప్రయాణానికి అనుమతిస్తామని, వారిని ఆపబోమని తెలిపారు. అలాగే, ఆరోగ్య సేతు యాప్ వినియోగంలోనూ స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి.. అది ఓ ప్రాధాన్యత మాత్రమేనని, తప్పనిసరేం కాదని తెలిపారు.