Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్లకు సర్కారు అనుమతి ఉందట?!!

By:  Tupaki Desk   |   30 Sept 2015 4:00 PM IST
ఎన్ కౌంటర్లకు సర్కారు అనుమతి ఉందట?!!
X
ఇటీవల వరంగల్ లో చోటు చేసుకున్న మావో ఎన్ కౌంటర్లను నిరసిస్తూ.. అసెంబ్లీ ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వామపక్ష నేతల్ని పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణ ఉద్యమానికి అవుట్ రెట్ గా మద్ధతు పలికి.. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోవాలని బలంగా కోరుకున్నారు.

అలాంటి హరగోపాల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పల్లెల్లో విధ్వంసాన్ని సృష్టించొద్దని.. ప్రతి అంశం రికార్డు అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన తొలి సర్కారు అని.. వందేళ్ల తర్వాత చరిత్ర రాసినా.. తొలి ప్రభుత్వం అనుసరించిన విధానాల గురించి చర్చ తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు.

పై నుంచి అనుమతులు లేకుండా పోలీసులు ఎన్ కౌంటర్ చేయరన్న హరగోపాల్.. వీలుంటే అరెస్ట్ చేయాలని.. న్యాయవ్యవస్థ ద్వారా విచారణ జరిపించాలన్నారు. మావోయిస్టులైనా.. మరెవరైనా సరే ఇదే విధానాన్ని అనుసరించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల మాదిరే.. తెలంగాణ పోలీసులు కూడా అదే తీరుతో ప్రవర్తిస్తున్నారన్న హరగోపాల్ మాటలు చూస్తే.. వరంగల్ ఎన్ కౌంటర్ కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఉందన్న మాటను బాహాటంగా చెప్పేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది.