Begin typing your search above and press return to search.

కేటీఆర్ లో ఎప్పుడూ చూడని సంతోషం, గర్వం

By:  Tupaki Desk   |   11 Dec 2019 4:25 AM GMT
కేటీఆర్ లో ఎప్పుడూ చూడని సంతోషం, గర్వం
X
దాహం వేస్తే ఆకాశం వైపు.. ఆకలి వేస్తే భూమి వైపు చూసే మెట్ట ప్రాంతం అదీ.. రాయలసీమలోలాంటి.. మరీ సినిమాటిక్ డైలాగులంత కరువు కాటకాలు లేవు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల ప్రాంతం మెట్ట ప్రాంతంగానే నీటి కట కటలతో ఉండేది. వానలు పడితేనే పంటలు వేసేవారు. కానీ ఒకే ఒక్క ప్రాజెక్టు ఇప్పడు మెట్టప్రాంతం సిరిసిల్ల కరువు తీర్చింది. ఆ పని చేసిన వారు ఎవరో కాదు.. సిరిసిల్ల ఎమ్మెల్యే , రాష్ట్ర మంత్రి కేటీఆర్..

సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలవడం ఇక్కడ దరిద్రాన్ని ప్రారద్రోలింది. నేతలన్నల ఆకలిచావులను అరికట్టి వారికి బతుకమ్మ చీరలు సహా ప్రభుత్వ కాంట్రాక్టులు వచ్చేలా చేసింది.

ఇక అంతేనా మెట్టప్రాంతం వల్ల నీటి జాడలు తక్కువగా ఉన్న సిరిసిల్ల జిల్లాకు కేటీఆర్ భగీరథ ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. మానేరు వాగుపై కాళేశ్వరానికి గుండె కాయ అయిన మిడ్ మానేరు ప్రాజెక్టు ను టీఆర్ఎస్ సర్కారు కట్టింది. సిరిసిల్లలోనే ఈ ప్రాజెక్టును కట్టించడంలో నిర్వాసితులను ఒప్పించడంలో కేటీఆర్ కీరోల్ పోషించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు లో మొత్తం 25 టీఎంసీలు నింపుతున్నారు. ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దాదాపు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం వరకూ వచ్చాయి. కరువుతో అల్లాడే సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పుడు నీటి జాడలు చూసి సిరిసిల్ల ప్రజలు పులికించి పోతున్నారు. కేటీఆర్ కు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.

కరువు ప్రాంతానికి నీళ్లను ఎదురెక్కించిన కేటీఆర్, కేసీఆర్ ల సంకల్పానికి నిదర్శనంగా తాజాగా కేటీఆర్ ట్విట్టర్ ఖాతా లో సిరిసిల్ల వాసులు ఫొటోలు షేర్ చేసి హల్ చల్ చేస్తున్నారు. కేటీఆర్ కు కృతజ్ఞతల తో జనాలు హోరెత్తిస్తున్నారు.