Begin typing your search above and press return to search.

హ‌న్మంతుడి జ‌న్మ‌స్థానంపై చ‌ర్చ.. ఎవరు ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   28 May 2021 11:00 AM IST
హ‌న్మంతుడి జ‌న్మ‌స్థానంపై చ‌ర్చ.. ఎవరు ఏమన్నారంటే?
X
ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థానంపై కొన‌సాగుతున్న వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. హ‌న్మంతుడు త‌మ‌వాడేనంటూ ప‌ట్టుబడుతున్న టీటీడీ - క‌ర్నాట‌కలోని హ‌నుమ‌ద్ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు.. గురువారం తిరుప‌తిలో చ‌ర్చ నిర్వ‌హించాయి. ఈ భేటీలో టీటీడీ పండితుల క‌మిటీకి చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన ప్రొఫెస‌ర్ ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, క‌ర్నాట‌కలోని హ‌నుమ‌ద్ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కుడు గోవిందానంద‌ స‌రస్వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు. కుప్పా విశ్వ‌నాథ శాస్త్రి న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు.

అయితే.. ఈ చ‌ర్చ‌ల్లో ఎవ‌రి వాద‌న వారు వినిపించ‌గా.. చ‌ర్చ‌ల అనంత‌రం కూడా అస‌లు విష‌యం తేల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ భేటీ త‌ర్వాత ముర‌ళీధ‌ర శ‌ర్మ మాట్లాడుతూ.. పురాణాలు, ఇతిహాసాల ప్ర‌కారం హ‌న్మంతుని జ‌న్మ‌స్థానం తిరుప‌తి ఏడు కొండ‌ల్లోని అంజ‌నాద్రేన‌ని చెప్పారు. క‌ర్నాట‌క‌లోని పంపాన‌ది ఒడ్డున ఉన్న అంజ‌న‌హ‌ళ్లి హ‌న్మంతుడి జ‌న్మ‌స్థాన‌మ‌ని రామాయ‌ణంలో ఉంద‌ని గోవిందానంద స‌ర‌స్వ‌తి చెబుతున్నార‌ని, కానీ.. దానికి ఆయ‌న స‌రైన ఆధారాలు చూప‌లేద‌ని చెప్పారు.

రామాయ‌ణంలో కిష్కింధ‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, ఉత్త‌రకాండ‌లో హ‌నుమంతుడి జ‌న్మ‌వృత్తాంతం గురించి మాత్ర‌మే ఉంద‌ని, జ‌న్మ‌స్థానం గురించిన ప్ర‌స్థావ‌నే లేదని ముర‌ళీధ‌ర శ‌ర్మ చెప్పారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న త‌ర్వాత న్యాయ‌నిర్ణేత‌గా ఉన్న కుప్పా విశ్వ‌నాథ శాస్త్రి కూడా టీటీడీకే మ‌ద్ద‌తు తెలిపార‌ని అన్నారు. గోవిందానంద స్వామి వాద‌న‌లో స్ప‌ష్ట‌త లేద‌ని చెప్పార‌ని అన్నారు.

కాగా.. ఈ చ‌ర్చ అనంత‌రం గోవిందానంద మాట్లాడుతూ.. హ‌న్మంతుడి జ‌న్మ‌స్థానంపై టీటీడీ చేసిన ప్ర‌క‌ట‌న ఆక్షేప‌ణీయం అని అన్నారు. ఈ విష‌య‌మై పెద్ద‌జీయ‌ర్‌, చిన్న జీయ‌ర్‌, శృంగేరి పీఠాధిప‌తి శంక‌రాచార్యులు, కంచి పీఠాధిప‌తి త‌దిత‌రులు చెబితే ధ‌ర్మ‌బ‌ద్ధం అవుతుంద‌ని ఆయ‌న వ్యాక్‌యానించారు. టీటీడీ పండితుల క‌మిటీలో పెద్ద జీయ‌ర్ కు ఎందుకు చోటు క‌ల్పించ‌లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. రామాయ‌ణం ప్ర‌కారం హ‌న్మంతుడు హంపిలోనే జ‌న్మించాడ‌న్న గోవిందానంద‌.. దీనిపై టీటీడీ బ‌హిరంగ చ‌ర్చ జ‌ర‌పాల‌ని అన్నారు. దీంతో.. ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థ‌ల వివాదం పీఠ‌ముడిగానే మిగిలిపోయిన‌ట్టైంది.