Begin typing your search above and press return to search.
హనుమాన్ జన్మస్థలం: ఏపీ, కర్ణాటక ఫైట్
By: Tupaki Desk | 12 April 2021 4:09 PM ISTమన దేవుడైన హనుమంతుడు సంచరించినప్పుడు చూసిన వారు ఎవరూ లేరు. కేవలం గ్రంథాలు, చరిత్రకారుల నుంచి మాత్రమే ఆయన కాలాన్ని మనం తెలుసుకోగలిగాం. ఆధారాలు లేకపోవడం వల్ల.. చాలా మంది పౌరాణిక సంఘటనలు తమ స్థానంలో జరిగాయని భావిస్తారు.. ఇప్పుడు చిరంజీవి అయిన హనుమంతుడి జన్మస్థలంపై వివాదం నెలకొంది.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ రాష్ట్రంలోనే హనుమంతుడి నిజమైన జన్మస్థలం అని చెప్పుకుంటున్నాయి.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వేసిన కమిటీ తిరుపతి హనుమంతుడి జన్మస్థలం అని ప్రకటించింది. దీన్ని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరో వాదనను తెరపైకి తీసుకొచ్చింది.
చాలా కాలంగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లా అనెగుడికి సమీపంలో ఉన్న అంజనాద్రి కొండను హనుమంతుడి జన్మస్థలంగా కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ఈ స్థలాన్ని కిష్కిందా అని కూడా పిలుస్తారు. రామాయణంలో కిష్కిందా ప్రస్తావించబడినందున, ఇది హనుమంతుడి జన్మస్థలంగా విస్తృతంగా పరిగణించబడుతుందని కర్ణాటక వాడిస్తోంది..
తిరుపతి ఏడు కొండలలో ఒకటైన అంజనాద్రి కొండపై హనుమంతుడు జన్మించాడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఇదే అంశంపై తన నివేదికను అతిత్వరలో సమర్పించనుంది. ఈ ప్యానెల్‌లో వేద పండితులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఇస్రో శాస్త్రవేత్త ఉన్నారు. తిరుపతిని హనుమంతుడి జన్మస్థలం అని నిరూపించడానికి తగిన ఆధారాలున్నాయని వారు వాదిస్తున్నారు.
ఇప్పుడు ఈ అంశంపై కొత్త వాదన తెరపైకి వచ్చింది. హనుమంతుడు కర్ణాటకలోని అరేబియా సముద్రం ఒడ్డున జన్మించాడని శివమోగలోని రామచంద్రపుర మఠం అధిపతి రాఘవేశ్వర భారతి చెప్పారు. రామాయణంలో సీతుకు హనుమంతుడు అదే విషయాన్ని ప్రస్తావించాడని ఆయన పేర్కొన్నారు. గోకర్ణను హనుమాన్ జన్మభూమి అని, కిష్కిందను తన కర్మభూమి అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా సహా చాలా సమస్యలు ప్రస్తుతం తాండవిస్తున్న సమయంలో హనుమంతుడి వివాదం పతాకస్తాయికి చేరంది. ఈ ప్రత్యేకమైన వాదన మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ వాదన ఎప్పుడు ముగుస్తుందనేది వేచిచూడాలి.
