Begin typing your search above and press return to search.

అర్ధనగ్న జీన్స్ వివాదం: బీజేపీ నేతలపై ప్రియాంక ఫైర్

By:  Tupaki Desk   |   19 March 2021 6:30 AM GMT
అర్ధనగ్న జీన్స్ వివాదం: బీజేపీ నేతలపై ప్రియాంక ఫైర్
X
మోకాళ్ల వరకు కనిపించేలా మహిళలు 'అర్ధనగ్న జీన్స్' వేసుకొని దేశ పరువు తీస్తున్నారంటూ బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం స్పందించారు. బీజేపీ నాయకులను చీల్చి చెండాడారు. 'ఖాకీ' ప్యాంటులు సగం వరకే వేసుకున్న వివిధ బీజేపీ పార్టీ నాయకుల చిత్రాలను ఆమె ట్వీట్ చేశారు: "ఓహ్ మై గాడ్ !!! వారి మోకాళ్లు కనిపిస్తున్నాయి. " అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మంగళవారం వివాదాన్ని రేకెత్తించారు. విలువలు పోతున్నాయని.. మహిళలతో సహా యువకులు మోకాళ్ల వరకు కనిపించేలా జీన్స్ ధరించి ఈ రోజుల్లో వింత ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించాడు. ఒక ముఖ్యమంత్రి నుండి తాజా వ్యాఖ్యలు రావడంతో ఇది పెద్దదుమారం రేపింది.

"మహిళల పట్ల ఈ రకమైన ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని కోరాలని మేము కోరుతున్నాము" అని కాంగ్రెస్ నేతలు లంబా డిమాండ్ చేశారు. రావత్ క్షమాపణ చెప్పకపోతే, దేశ మహిళలు ఆందోళనను ప్రారంభిస్తారు. బిజెపి నాయకులను మరియు వారి మనస్తత్వాన్ని బయటపెడుతారని హెచ్చరించారు.

"రాజ్యాంగం ప్రకారం దేశ మహిళలకు తినడానికి, ఇష్టమైన దుస్తులు ధరించడానికి లేదా మాట్లాడటానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాంటి వ్యాఖ్యలను వారు సహించరు" అని తాజాగా ప్రియాంక గాంధీ సైతం స్పష్టం చేశారు.