Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ పై హ్యాకర్ల కన్ను.. వార్నింగ్ ఇచ్చిన ఐబీఎం
By: Tupaki Desk | 4 Dec 2020 2:00 PM ISTవణికిస్తున్న మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకోవటమే కాదు.. రష్యా.. బ్రిటన్ దేశాల్లో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి వచ్చింది. దీంతో.. వ్యాక్సిన్ గురించి బెంగ పెట్టుకున్న వారు ఇప్పుడిప్పుడే సాంత్వన చెందుతున్నారు. ఇలాంటివేళ.. గుండెలు అదిరే మాట చెప్పింది ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం. వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలకు హ్యాకర్ల ముప్పు ముందు ఉన్నట్లుగా వెల్లడించింది.
వ్యాక్సిన్ రవాణా చేసే సంస్థల డేటాను అంతర్జాతీయ హ్యాకర్ల టీం టార్గెట్ చేసిందని.. గతంలో ఎప్పుడూ లేనంతగా వారు అసాధారణమైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానించింది. టెక్నాలజీ సాయంతో అంతర్జాతీయ హ్యాకర్లు వ్యాక్సిన్ కోల్డ్ చైన్ అంశంపై సమాచారాన్ని సేకరించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ సైబర్ సెక్యురిటీ టీం గుర్తించినట్లు వెల్లడించింది.
వ్యాక్సిన్ ను నిల్వ ఉంచేందుకు అత్యంత శీతలీకరణ యంత్రాలు అవసరం కావటం.. హైఎండ్ రిఫ్రిజరేషన్ యూనిట్ల తయారీ.. వాటి మోడల్స్ తో పాటు.. వాటి ధరలపైనా హ్యాకర్లు ఫోకస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ డేటాను సేకరించేందుకు ఈ మియిళ్ల రూపంలో వల విసురుతారని.. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే వ్యాక్సిన్ కోల్డ్ చైన్ ప్రక్రియకు భంగం కలుగుతుందని చెప్పింది.
వ్యాక్సిన్ రవాణాలో ఏదైనా ఆటంకం ఏర్పడితే.. అవి చెడిపోతాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ రవాణా అంశం రానున్న రోజుల్లో పెను సవాలుగా మారుతుందని చెబుతున్నారు. మరి.. హ్యాకర్లను ఎలా అదుపు చేస్తారన్నది ఇప్పటికైతే ప్రశ్నేనని చెప్పక తప్పదు.