Begin typing your search above and press return to search.

హెచ్ 1 వీసా..అమెరికాకు షాకిచ్చిన సర్వే

By:  Tupaki Desk   |   14 Dec 2016 6:57 AM GMT
హెచ్ 1 వీసా..అమెరికాకు షాకిచ్చిన సర్వే
X
వలసదారులను ఇక్కట్ల పాలు చేయడమే లక్యంగా ప్రపంచ పెద్దన్న అమెరికా వేస్తున్న అడుగులకు సాక్షాత్తు ఆ దేశానికే చెందిన ఓ సంస్థ గ‌ట్టి హెచ్చ‌రిక చేసింది. హెచ్-1బీ - ఎల్-1బీ వీసాల ఫీజు పెంపుపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ముందు భారత్ దాఖలు చేసిన ఫిర్యాదు పరిష్కార దశకు చేరుకుంటే అమెరికాకు చిక్కులు ఎదురవుతాయని వాషింగ్ట‌న్ కు చెందిన‌ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ ఎస్) అనే సంస్థ అమెరికా కాంగ్రెస్ సభ్యులను హెచ్చరించింది. డబ్ల్యూటీవో ఆదేశాల మేరకు అమెరికాపై వాణిజ్యపరమైన ఆంక్షల అమలుకు ఇది దారితీయొచ్చని అమెరికా కాంగ్రెస్‌ కు స్వతంత్ర పరిశోధనలు చేసిపెట్టే సీఆర్‌ ఎస్ తెలిపింది.

హెచ్-1బీ - ఎల్-1బీ వీసాల ఫీజు పెంపు గాట్స్ వాణిజ్య ఒప్పందానికి ఇది విరుద్ధమని - డబ్ల్యూటీవో తీర్పు వెలువడితే అమెరికా తన నిబంధనలను సవరించుకోవాల్సి వస్తుందని స్ప‌ష్టం చేసింది. కొన్నిరకాల వీసా దరఖాస్తులకు ఫీజు పెంచాలన్న అమెరికా నిర్ణయం భారత ఐటీ నిపుణులకు ఇబ్బందికరంగా ఉందంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో)కు మనదేశం ఫిర్యాదు చేసింది.

ఇటీవల హెచ్ 1బీ - ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచింది. డిసెంబర్ 18 - 2015 తర్వా హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు అదనంగా రూ. 2.67 లక్షలు చెల్లించాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్‌ సీఐఎస్) ప్రకటించింది. అలాగే.. ఎల్1ఏ - ఎల్2బీ దరఖాస్తుదారులు రూ. 3.01 లక్షలు అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగస్తులుండి.. వారిలో కనీసం 50% మంది హెచ్1బీ - లేదా ఎల్1ఏ - ఎల్1బీ నాన్ ఇమిగ్రంట్ స్టేటస్ వీసాదారులై ఉన్న కంపెనీలకు ఈ పెంపు వర్తిస్తుందని యూఎస్‌ సీఐఎస్ తెలిపింది. ఈ ఫీజు సాధారణ - ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు, ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఫీజు - అమెరికన్ కాంపిటీటివ్‌ నెస్ అండ్ వర్క్‌ ఫోర్స్ ఇంప్రూవ్‌ మెంట్ యాక్ట్ ఫీజులకు అద‌నమని స్పష్టం చేసింది.ఈ పెంపు సెప్టెంబర్ 30 - 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబర్ 18న సంతకం చేయడంతో సంబంధిత చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. దీనిపైనే భారతదేశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ కు భార‌త్ ఫిర్యాదు చేసింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/