Begin typing your search above and press return to search.

హెచ్‌ 1బి వీసాల విషయంలో భారత్‌ పై అక్కసు...

By:  Tupaki Desk   |   9 March 2019 6:38 AM GMT
హెచ్‌ 1బి వీసాల విషయంలో భారత్‌ పై అక్కసు...
X
అమెరికాలో ప్రభుత్వం హెచ్‌ 1 బీ వీసాలపై కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో విదేశీయుల దరఖాస్తులను ట్రంప్‌ ప్రభుత్వం భారీగానే తిరస్కరిస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన దరఖాస్తులు కూడా అత్యధికంగానే ఉన్నాయి.

అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌ దరఖాస్తు చేసుకున్న హెచ్‌ 1 బీ వీసాల్లో 3,548ని అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. అయితే ఈ దరఖాస్తుల సంఖ్య గతేడాది ఒక్క ఆమెజాన్‌ సంస్థకు తిరస్కరించిన దరఖాస్తుల సంఖ్య కంటే ఎక్కువ కావడం విశేషం.

దరఖాస్తులను తిరస్కరించబడిన 30 అంతర్జాతీయ కంపెనీల్లో భారత్‌కు చెందిన ఆరు కంపెనీలో ఉన్నాయి. వాటిలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ ఐటీ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు చేసుకున్న హెచ్‌ 1 బీ వీసాల దరఖాస్తుల్లో 3,548 ట్రంప్‌ ప్రభుత్వం రిజెక్ట్‌ చేసింది. అలాగే టెక్‌ మహీంద్ర, హెచ్‌సీఎల్‌ సంస్థలు చేసుకున్న దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యాయి.

ఇదిలా ఉండగా మైక్రోసాఫ్ట్‌, ఆమెజాన్‌, ఆపిల్‌ వంటి సంస్థలను మాత్రం అమెరికా ప్రభుత్వం ఆదరిస్తోంది. ఇవి దరఖాస్తు చేసుకున్న వీసాల్లో కొన్ని మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. భారత్‌కు చెందిన ఆరు ఐటీ కంపెనీల్లో చేసుకున్న దరఖాస్తుల్లో 2,145 మాత్రమే ఆమోదం పొందాయి.

ఈ సంఖ్య గతేడాది అమెజాన్‌ సంస్థ సాధించిన వీసాల కన్నా తక్కువ. అమేజాన్ సంస్థ అప్పుడు చేసుకున్న అప్లికేషన్లలో 2,399 హెచ్‌ 1 బీ వీసాలు సాధించడం విశేషం.దీంతో భారత్‌ ఐటీ రంగ అభివృద్ధిని అమెరికా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఐటీ సంస్థలు ఆవేదన చెందుతున్నారు.