Begin typing your search above and press return to search.

సీఎం జగన్ తీరుపై మండిపడుతున్న జీవీఎల్?

By:  Tupaki Desk   |   26 Nov 2021 8:00 AM IST
సీఎం జగన్ తీరుపై మండిపడుతున్న జీవీఎల్?
X
తుఫాను, వరద ప్రభావిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందుంటూనే ఉంటోంది. గతంలోనూ ఆంధ్రప్రదేశ్ ను వరదలు, తుఫాను అతలాకులతం చేసినా మళ్లీ తట్టుకొని నిలబడుతోంది. అయితే వరదలు, తుఫాను తదితర ప్రకృతి విపత్తుల కారణంగా ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా మరోసారి వరదలు ఏపీని ముంచుతున్నాయి.

కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుపతి పట్టణంలో వరదలతో అతలాకూతలంకాగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయి. పంటలు, ఇళ్లు దెబ్బతినడంతో పెద్దమొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై బీజేపీ జీవీఎల్ నర్సింహారావు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం వరద సాయంపై ప్రధానికి లేఖ రాసిన వెంటనే ఆయన స్వయంగా జగన్ తో మాట్లాడి అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. రేపు 'ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం' ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని తెలిపారు.

ఇదే సమయంలో సీఎం వ్యవహారతీరును జీవీఎల్ తప్పుబట్టారు. వరద సాయం విషయంలో రాష్ట్ర సర్కారు సరిగ్గా స్పందిచలేదని విమర్శించారు. గతంలోనే కేంద్రం 'విపత్తు సహాయ నిధి' కింద నిధులను ఇచ్చినా ఎందుకు ఖర్చు చేయలేదని జీవీఎల్‌ ప్రశ్నించారు. కేవలం ప్రధానికి లేఖలు రాసి చేతులు దులుపుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుందా? అంటూ మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదు? బాధితులను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ప్రజల వద్దకు వెళ్లకుండా కేవలం ప్యాలెస్ నుంచే పాలన సాగిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టకుండా సక్రమంగా బాధితుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

వరద విపత్తుల సమయంలో టీడీపీ, వైసీపీలు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మానిటరింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆయన చెప్పారు. కేంద్రం, రాష్ట్రం ప్రజలకు ఇచ్చే నిధులను వారికి వివరించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.