Begin typing your search above and press return to search.

బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లుకే సిట్టింగ్ విచార‌ణ‌?

By:  Tupaki Desk   |   25 Oct 2018 1:49 PM GMT
బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లుకే సిట్టింగ్ విచార‌ణ‌?
X
వైసీపీ అధినేత జగన్ పై జ‌రిగిన దాడిని వైసీపీ నేత‌లు - నాయ‌కులు తీవ్రంగా ఖండిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జాస్వామ్యంలో ఓ ప్ర‌తిప‌క్ష నేత పై ఈ త‌ర‌హాలో దాడి చేయ‌డం ఏమిట‌ని వైసీపీ నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే విచార‌ణ చేప‌ట్టి...దాని వెనుక ఉన్న వారిని బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ పై దాడిని న‌టుడు శివాజీ ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో కొన్ని నెల‌ల క్రిత‌మే వెల్ల‌డించార‌ని, ఆ దాడి వెనుక బీజేపీ ఉంద‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆనాడు శివాజీ మాట్లాడిన వీడియో ఆధారంగా సోష‌ల్ మీడియాలో బీజేపీపై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ వీడియోల‌పై, బీజేపీ పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ప్ర‌తి దానికి బీజేపీపై బుర‌ద జ‌ల్ల‌డం టీడీపీ నేత‌ల‌కు అల‌వాటైంద‌న్నారు. జ‌గ‌న్ పై జ‌రిగిన దాడిని తాను - బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. జగన్ పై దాడి అమానుషమని - దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆయ‌న అనుమానించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిపై వ్య‌క్తిగ‌త పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఆ నిందితుడికి ఉంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని , ఇది క‌చ్చితంగా రాజ‌కీయ కోణంలో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం అని అన్నారు. నిందితుడిని ఎవ‌రు ప్రేరేపించారు...ఏ ఆలోచ‌న‌తో ప్రేరేపించారు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై నిష్పాక్షిక విచారణ జరగాలని - ఓ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ నేప‌థ్యంలో సీఎం చంద్రబాబుపై జీవీఎల్ మండిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌తోనైనా చంద్ర‌బాబు కళ్లు తెరవాలని, హిట్లర్ పోకడలు మానాలని నిప్పులు చెరిగారు. హింస ద్వారా ప్రతిపక్షాలను బెదిరించాలని చూస్తే సహించబోమ‌ని జీవీఎల్ హెచ్చరించారు. 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటే స‌రిపోద‌ని...రెస్పాన్సిబిలిటీ ఉండాలని అన్నారు. ఈ దాడి వెనుకు బాబు రాజ‌కీయ అభ‌ద్ర‌తా భావం ఉంద‌ని ఆరోపించారు. అచ్చోసిన ఆంబోతుల‌ను చంద్ర‌బాబు పెంచి పోషిస్తున్నారని, వారిని కంట్రోల్ చేయకుంటే ప్ర‌జ‌లు త‌రిమికొడ‌తారని అన్నారు. మాఫియా సంస్థ‌లా హింస‌ను టీడీపీ నేత‌లు అవ‌లంబిస్తున్నార‌ని, గ‌తంలో కూడా అమిత్ షా, క‌న్నాల‌పై దాడులు జ‌రిగాయ‌ని అన్నారు. త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం గ్లోబ‌ల్ నెంబ‌ర్ వ‌న్ అని అన్నారు. అవాస్త‌వాల‌ను, వీడియోల‌ను ప‌బ్లిసిటీ చేస్తున్నారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం ఇటువంటి ఎయిర్ పోర్ట్ వంటి ప్ర‌దేశంలో దాడి చేశారని, ఇక్క‌డైతే రాష్ట్ర ప్ర‌భుత్వంపై అనుమానం రాద‌ని అలా చేసి ఉంటార‌ని అన్నారు. `ఆప‌రేష‌న్ పేడ` అని ఓ న‌టుడు ఏవేవో చెబుతున్నారని న‌టుడు శివాజీని ఉద్దేశించి ప‌రోక్షంగా మండిప‌డ్డారు. ఆయ‌న రెండో బ్ర‌హ్మం గారుఅని, సూప‌ర్ ఇంటిలెజెన్స్ బ్యూరో ద్వారా..ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాలు ఆయ‌న‌కు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీ...`చంద్ర‌న్న ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ`తో కాకుండా...సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు, ఈ ఘ‌ట‌న‌తోపాటు చంద్ర‌బాబు అవినీతి వ్య‌వహారాలు, దౌర్జ‌న్యాలు బ‌య‌ట‌పెట్టేందుకు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు జీవీఎల్ డిమాండ్ చేస్తున్నారేమోన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు ఈ దాడి ఘ‌ట‌న‌ను కేంద్రం అస్త్రంగా మ‌ల‌చుకోనుంద‌ని అనుకుంటున్నారు.