Begin typing your search above and press return to search.

ఎన్ఐఏ అంటేనే బాబు భయపడుతున్నాడట..

By:  Tupaki Desk   |   6 Jan 2019 3:30 PM IST
ఎన్ఐఏ అంటేనే బాబు భయపడుతున్నాడట..
X
వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు కాకినాడలో బీజేపీ మహిళా కార్యకర్తల పట్ల అమార్యదగా వ్యవహరించారని అన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు ఏన్ఏఐ దర్యాప్తు చేస్తుండటంతో టీడీపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీని పార్టీని ప్రజలు ఛీ కొట్టారని ఇక ఆంధ్రాలోనూ ఆ పార్టీకి ఇదే గతి పడుతుందని జీవీఎల్ జోక్యం చెప్పారు. ఏపీలో టీడీపీకి ఈ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. తెలంగాణలో ఓటమి తర్వాత బాబులో తీవ్ర అసహనం పెరిగిపోయిందని అన్నారు. ఆయనం చేస్తున్నారో ఆయనకే తెలవడం లేదని ఎద్దేవా చేశారు.

గతంలో పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబుకు మళ్లీ అదేగతి పడుతుందని అన్నారు. ఏపీ ప్రజలంతా తనవైపు ఉన్నారని బాబు భ్రమపడుతున్నారని ఈ ఎన్నికల్లో బాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.జగన్ పై దాడి కేసును టీడీపీ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసిందని ఇది ఆ పార్టీ కక్ష సాధింపుకు అద్దం పడుతుందని తెలిపారు.

ఈ కేసును ఎన్ఐఏ కు బదాలయించడంతో బాబు వణికిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ రోజా వేరుగా అన్నారు. రాష్ట్రానికి సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు రావద్దని చెప్పిన చంద్రబాబు తాజాగా ఎన్ఐఏ కూడా రావద్దని అంటారా అని ప్రశ్నించారు. దీనిపై బాబు అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.