Begin typing your search above and press return to search.

ఐఫోన్ 13లో పింక్ స్క్రీన్ ఇష్యూ.. మీకీ విషయం తెలవటం అవసరం

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:30 AM GMT
ఐఫోన్ 13లో పింక్ స్క్రీన్ ఇష్యూ.. మీకీ విషయం తెలవటం అవసరం
X
యాపిల్ ఉత్పత్తులు ఎంత పక్కాగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. తన ఉత్పత్తులకు కాస్తంత భిన్నంగా ఐఫోన్ సిరీస్ ల విషయంలో.. యాపిల్ సంస్థ అప్పుడప్పడు సమస్యల్నిఎదుర్కొంటూ ఉంటుంది. అయితే.. ఏదైనా లోపాన్ని గుర్తిస్తే.. దాన్ని క్లియర్ చేసేందుకు యాపిల్ యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ మధ్యనే విడుదలైన ఐఫోన్ 13కు సంబంధించి లేటెస్టు ఇష్యూ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఈ సాంకేతిక సమస్య గురించి సోషల్ మీడియాలో పలువురు టెక్ నిపుణులు మాట్లాడుతున్నారు.

ఇంతకీ.. ఐఫోన్ 13లో ఎదురవుతున్న ఇష్యూ ఏమంటే.. ఉన్నట్లుండి ఈ ఫోన్ స్క్రీన్ పింక్ కలర్ లోకి మారిపోవటం. అంతేకాదు.. అప్పుడప్పడు మొబైల్ నెమ్మదించటం.. ఆటోమేటిక్ గా రీస్టార్ట్ కావటం లాంటి సమస్యల్ని ఐఫోన్ 13 యజమానులు ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. పలువురు ఐఫోన్ యూజర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి సోషల్ మీడియాలో ఏకరువు పెడుతూ.. పోస్టులు పెడుతున్నారు. దీనిపై యాపిల్ సంస్థ మాత్రం.. తమకు పింక్ స్క్రీన్ ఇష్యూ మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదని చెబుతోంది. ఫోన్ స్టక్ అయినప్పుడు మాత్రం.. పింక్ స్క్రీన్ సమస్య తలెత్తవచ్చని చెబుతోంది.

ఇదిలా ఉంటే.. ఐఫోన్ 13 యజమానులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే..
- మొబైల్ స్క్రీన్ స్పష్టమైన కారణం లేకుండా పింక్ కలర్ లోకి మారటం
- సాఫ్ట్ వేర్ అప్డేట్.. మొబైల్ రీసెట్ చేసినా సమస్య తీరటం లేదు
- మొబైల్ స్లో అవుతోంది
- ఆటోమేటిక్ గా రీస్టార్ట్ కావటం

మరీ సమస్యలకు పరిష్కారం ఏమిటి? దీనిపై టెక్ నిపుణులు ఏమంటున్నారు అన్నది చూస్తే..
- సిస్టమ్ సాఫ్ట్ వేర్ లో లోపం వల్లనే ఈ సమస్యలన్ని
- పింక్ స్క్రీన్ సమస్యను ఎదుర్కొంటున్న వారు.. వారి డేటాను బ్యాకప్ చేయాలి
- తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కు అప్ గ్రేడ్ చేయటం ద్వారా.. ఈ ఇష్యూను అధిగమించే వీలుంది
- పింక్ స్క్రీన్ ఇష్యూను యాపిల్ తన తర్వాతి అప్డేట్ లో పరిష్కారం తీసుకొచ్చే అవకాశం ఉంది.