Begin typing your search above and press return to search.
పుల్లెల గోపిచంద్ పై మరోసారి గుత్తా జ్వాలా ఫైర్..
By: Tupaki Desk | 9 Nov 2020 8:40 PM ISTబ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మరోసారి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్పై విరుచుకుపడ్డారు. ఎందరో క్రీడాకారులు రాణించకపోవడానికి కారణం గోపిచందే అని ఆమె ఆరోపించారు. ఆయన తన సొంత అకాడమీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ అయి ఉండి తన బాధ్యతను విస్మరించి.. అకాడమీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా ఏమన్నారంటే.. ‘ నేను ఏం మాట్లాడినా కాంట్రవర్సి అంటున్నారు. నేను నిజాలను నిర్భయంగా చెబుతున్నాను. అందుకే నేను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తానని నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి గోపిచంద్ ఓ స్వార్థపరుడు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారులు బయటకు రావడం లేదు.
ఒలంపిక్స్ తర్వాతా నేను బయటకొచ్చాక ఎంతో నిరాశపరిచాడు. నాకు ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వలేదు. తన అకాడమీలో కోచింగ్ తీసుకున్నవాళ్లకు మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జీతం తీసుకుంటూ దేశానికే ద్రోహం చేస్తున్నాడు. ముందు ఆయన తన చీఫ్‌కోచ్ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాతా అకాడమీని నిర్వహించుకోవాలి. లేదంటే అకాడమీని మూసేసి కోచ్ బాధ్యతలనైనా సక్రమంగా విధించాలి’ అంటూ జ్వాలా మండిపడ్డారు. అయితే గోపిచంద్పై గుత్తా జ్వాలా ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాదు. చాలా ఏళ్లుగా వీరిద్దరి మధ్య వివాదం నడుస్తున్నది.