Begin typing your search above and press return to search.
బెయిల్ ఇస్తే వ్యవసాయం చేస్తానంటున్నాడు!
By: Tupaki Desk | 22 Jun 2019 1:30 AM GMTనేనే దేవుడ్ని.. నాకు మీరంతా భక్తులుగా ఉండండి.. నా సేవలో తరించండి అంటూ నమ్మించటం ఒక ఎత్తు. దాన్ని తనను తానుగా నమ్మే పైత్యం మరో ఎత్తు. వివాదాస్పద రీతిలో పోలీసుల అదుపులోకి వెళ్లిన డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీమ్ ఎపిసోడ్ గుర్తుంది కదా? ప్రైవేటు సైన్యంతో పాటు.. నానా హడావుడి చేసిన అతగాడి జోరుకు కళ్లాలు వేసిన చట్టం దెబ్బకు అయ్యగారు జైల్లో చిప్పకూడు తింటున్నవైనం తెలిసిందే.
వివిధ కేసుల్లో దోషిగా తెలిసిన అయ్యగారిని జైల్లో పెట్టారు. జైలు దెబ్బకు భారీ ఆకారం కాస్తా బరువు తగ్గి కళ తప్పాడు. తాజాగా జైల్లో ఉన్న ఆయన పెరోల్ కోసం దరఖాస్తు చేశారు. తనకు కానీ బెయిల్ మంజూరు చేస్తే.. ఆశ్రమంలో వ్యవసాయం చేసుకుంటానని కోరుకుంటున్నాడు. తాను చేసినవి క్షమించరాని నేరాలేం కాదని.. జైల్లో తన ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో తనకు పెరోల్ ఇవ్వాలని కోరుతున్నాడు.
తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన ఆరోపణలు నిజం కావటంతో ప్రస్తుతం డేరా బాబా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. గడిచిన 23 నెలలుగా జైల్లో ఉన్న అతగాడి రిక్వెస్ట్ ను సిర్సా డిప్యూటీ కమిషనర్ పరిశీలిస్తున్నారు. జైల్లో ఉన్నాడు కాబట్టి ఇవాళ వ్యవసాయం చేస్తానంటాడు. రేపొద్దున వ్యవసాయం మొదలెట్టి.. ఇంకేమైనా చేస్తే ఎలా అన్న విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని పెరోల్ ఇచ్చే ఆలోచన చేస్తే మంచిగా ఉంటుందని చెప్పక తప్పదు.