Begin typing your search above and press return to search.

మావ‌ద్ద అద్దెకు ల‌వ‌ర్ ల‌భించును

By:  Tupaki Desk   |   13 Feb 2018 9:36 AM GMT
మావ‌ద్ద అద్దెకు ల‌వ‌ర్ ల‌భించును
X

మ‌రి ఇంత చెత్త ప్ర‌క‌ట‌న ఏంటి? ప‌్రేమికుడిని సెట్ చేయ‌డం ఏంటి చెండాలంగా? అందులోనూ సాఫ్ట్‌వేర్ సంస్థ అంటున్నారు...ఇలాంటి తిక్క ప‌నులు చేసే కంపెనీలు కూడా ఉంటాయా? అని విసుక్కోకండి, విస్మ‌యం చెంద‌కండి. ఉంటాయి..ఉంటాయి.ఎందుకు ఉండ‌వు! ఉంటాయి.!! ఇదిగో ఇదే ఆ క్రేజీ స్టోరీ. 26 ఏళ్ల శేఖర్ గుప్తా ఢిల్లీ ద‌గ్గ‌రలోని గుర్గావ్‌ లో ఓ వ్యాపారవేత్త. అంతేకాకుండా ఇతను ఓ సాఫ్ట్ వేర్ సంస్థ CEOగా పని చేస్తున్నాడు. వాలెంటైన్స్‌డే అంటే ఉండే సంద‌డి, ప్రేమికుల కోలాహ‌లం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు క‌దా? అయితే..ప్రేమికులు లేని వారి ప‌రిస్థితి ఏంటి అని మ‌నోడు తెగ ఆలోచించాడ‌ట‌. అందులో నుంచే ఓ వినూత్న ఆలోచ‌న పుట్టుకువ‌చ్చింది.

ఏంట‌య్యా ఆ ఆలోచ‌న అంటే బాయ్‌ఫ్రెండ్‌ను సెట్ చేయ‌డం!ఔను. వాలంటైన్స్ డే రోజున బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చాడు. చేతులు పట్టుకోవడం -నుదుటిపై ముద్దు పెట్టుకోవడం - కౌగిలించుకోవడం - లిప్ లాక్ కిస్ లను కావాలనుకునే అమ్మాయిల కోసం నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాడు. ఈ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ‘RICHGUY’ అనే ప్రోమో కోడ్ ను ఉపయోగిస్తే ప్యాకేజీలో 20 శాతం తగ్గింపు కూడా ఇచ్చాడు. అంతే కాకుండా తన ఆడి కారులో ఫ్రీ రైడ్ ఉంటుందని తెలిపాడు.

ఫేస్‌బుక్ లోని తన పోస్ట్ కు వేల సంఖ్యలో రిప్లయిలు, షేర్లు వస్తుండటం.. కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. దీనిపై శేఖర్ స్పందించాడు. కేవలం ఫన్ కోసమే ఈ పని చేస్తున్నట్లు తెలిపాడు. ప్రేమపై తన అభిప్రాయం అడిగినప్పుడు.. దేవుడి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ప్రేమ అని.. దీనికి ఎవరూ వెల కట్టలేరని తన అభిప్రాయాన్ని శేఖర్ తెలిపాడు. ఈ రోజు వరకు 20వేల కామెంట్లు వచ్చాయి. చూద్దాం ఈ కొత్త వాలెంటైన్స్ డే స్కీం ఎలా ప‌నిచేస్తుందో!