Begin typing your search above and press return to search.

వెంటాడిన మృత్యువు.. సౌదీలో తెలుగు యువకుడు మృతి

By:  Tupaki Desk   |   17 Aug 2019 10:46 AM GMT
వెంటాడిన మృత్యువు.. సౌదీలో తెలుగు యువకుడు మృతి
X
కక్కు వచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదంటారు.. ఇది మృత్యువు విషయంలో నిజమవుతుందన్న నానుడి ఉంది. సౌదీలో తెలుగు యువకుడిని మృత్యువు వెంటాడి ముంచేసింది. చనిపోవాలని రాసుంది కాబట్టి ఎంత జాగ్రత్త చర్యలు తీసుకున్నా కానీ మాచర్ల యువకుడు ప్రాణాలతో బతికి బట్టకట్టలేకపోయాడు. ఈ అనూహ్య ఘటన గుంటూరు జిల్లాలో విషాదం నింపింది.

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని 25వ వార్డుకు చెందిన ముస్తాఫా-షబీ మున్నీసా దంపతుల కుమారుడు సయ్యద్ ఆరీఫ్ (27) బాగా చదువుకున్నాడు. ఏకంగా సాఫ్ట్ వేర్ కొలువు కొట్టాడు. అనంతరం సౌదీకి వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ రియాల్ లు సంపాదిస్తున్నాడు. మూడేళ్లుగా కొడుకు సంపాదిస్తూ కన్నవారికి భరోసాగా నిలుస్తున్నాడు. కానీ ఏ దృష్టి పడిందో కానీ ఆరీఫ్ ను మృత్యువు కబళించింది.

సాఫీగా సాగిపోతున్న ఆరీఫ్ ను మృత్యువు వెంటాడింది. గురువారం తోటి స్నేహితులతో కలిసి సౌదీలోని రియాజ్ ప్రాంతంలో గల స్విమ్మింగ్ ఫూల్ లో ఈతకెళ్లాడు. అయితే రక్షణ చర్యలు తీసుకున్నా అతడు మరణాన్ని జయించలేకపోయాడు. ఈత కొట్టడానికి.. మునిగిపోవడానికి రక్షణగా బెలూన్ కట్టుకొని పైనుంచి స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకాడు. అయితే బెలూన్ పగిలిపోవడంతో ఊపిరాడక మృతిచెందాడు. స్నేహితులున్నా అతడిని కాపాడలేకపోయారు..

కాగా చెట్టంతా కొడుకు మరణవార్త విని ఆ తల్లిదండ్రులు మాచర్లలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..