Begin typing your search above and press return to search.

శవాలతో నిండిపోతున్న గుంటూరు GGH ఆసుపత్రి మార్చురీ ..ఇదే కారణం !

By:  Tupaki Desk   |   27 July 2020 2:20 PM IST
శవాలతో నిండిపోతున్న గుంటూరు GGH ఆసుపత్రి మార్చురీ ..ఇదే కారణం !
X
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి గత వారం రోజులుగా విలయతాండవం చేస్తుంది. ప్రతి రోజూ కూడా దాదాపుగా 7 వేల నుండి 8 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఈ కరోనా విలయతాండవానికి గుంటూరు GGH ఆసుపత్రి మార్చురీ కరోనా శవాలతో నిండిపోయిందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. కరోనాతో చనిపోతే దూరంగా ఉండే పరిస్ధితి నుంచి సోంతవారి మృతదేహలనే వదిలేసి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా భయంతో కొంతమంది తమ వారు చనిపోయారు అని తెలిసినా కూడా జంకుతున్నారు.

గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో గుంటూరు సమీపప్రాంతాల నుంచి రోజు పెద్ద సంఖ్య ప్రజలు వైద్యం కోసం జిజిహెచ్ వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో కొంతమంది వ్యాధి తీవ్రత పెరిగి , చికిత్స కి స్పందించక చనిపోతున్నారు. వీరిలో కరోనా నిర్ధారణ తరువాత చనిపోయితే మరికోందరు మృతి చెందిన తరువాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను మార్చురీలో భద్రపరుచుతున్నారు. అలాగే మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే.

కరోనా పరీక్షలు చేయడం ఆలస్యం అవుతుండటంతో కరోనా మృతదేహాలతో నిండిపోయిందని తెలుస్తోంది. దీంతో కొన్ని మృతదేహాలను బయటే ఉంచారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే 40 దాకా మృతదేహలు మార్చురీ గదిలో ఉన్నాయని ఓ వార్త వైరల్ అవుతుంది. చనిపోయిన తర్వాత అనేక అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. సహజ మరణాన్ని కూడా కరోనా పాజిటివ్ డెత్ ‌గా అనుమానిస్తున్నారు. అలాగే , కార్పొరేషన్‌ లో కరోనా పాజిటివ్‌ తో మృతిచెందిన వారిలో రోజుకు నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు అవకాశం ఉంది. దీనితో మార్చురీ శవాలతో పూర్తిగా నిండిపోయిందని తెలుస్తుంది. కాగా , ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో మొత్తం 10 వేల 3 కేసులు నమోదు అయ్యాయి. 4 వేల 971 యాక్టివ్ కేసులుండగా 4 వేల 934 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 98 మంది కరోనా భారిన పడి చనిపోయారు.