Begin typing your search above and press return to search.

డాన్స్ చేయలేదని నయనను కాల్చేశారు!

By:  Tupaki Desk   |   3 Feb 2017 3:52 AM GMT
డాన్స్ చేయలేదని నయనను కాల్చేశారు!
X
మూర్ఖత్వానికి పరాకాష్ట అనుకోవాలో లేక తాగుడు మత్తులో చేసిన దుర్మార్గం అనాలో కానీ... వారు అడిగిన ఒక పాటకు డాన్స్ చేయలేదని ఒక యువతిని కాలి చంపేశారు. ఈ దారుణం బీహార్ లో చోటుచేసుకుంది. ఇది కేవలం తాగిన మైకంలో చేసిన పనిగా భావించలేం కానీ.. వారి మూర్ఖత్వం, రాక్షసత్వంగానే భావించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... బీహార్ లోని రోహతాస్ జిల్లాలోగల ఉగర్ బిగా అనే గ్రామంలో ఒక ప్రభుత్వ వైద్యుడికి ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగింది. ఈ ఫంక్షన్ కి వచ్చిన కొంతమంది యువకులు ఆ కార్యక్రమంలోని డాన్సు హంగామాలను చూసి "ఫుల్" గా ఎంజాయ్ చేశారు. అప్పటికే మధ్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఆ డాన్సర్ ను... భోజ్ పురి హాట్ సాంగ్ అయిన "తోహ్రా సామియాన మైన్ చలే లగీ ధాయ్ ధాయ్ గోలీ" అనే పాటకు డాన్స్ చేయాలని అడిగారు. దీంతో ఆ యువతి రెండు సార్లు ఆ పాటకు డాన్స్ చేసింది. అయినా కూడా ఏమాత్రం సంతృప్తి చెందని ఆ యువకులు ఆమెను మరోసారి అదే పాటకు డాన్స్ చేయాలని అడిగారు. అయితే.. అప్పటికే అలసిపోయిన ఆ యువతి డాన్స్ ఆపేసి డ్రెస్సింగ్ రూం లోకి వెళ్లి దుస్తులు మార్చుకుని రెస్ట్ తీసుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే తుపాకీ శబ్ధం వినిపించింది.

అలా విశ్రాంతి తీసుకుంటున్న ఆ యువతిపై వెనకాల నుంచి కాల్పులు జరిపాడు ప్రేక్షకుల్లోని ఒక వ్యక్తి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతిరాలి పేరు నయన అని ఆమె వయసు 22 ఏళ్లు అని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/