Begin typing your search above and press return to search.

క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది మ‌నదేశ కంపెనీ తెస్తోంది తెలుసా?

By:  Tupaki Desk   |   18 April 2020 2:00 PM GMT
క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది మ‌నదేశ కంపెనీ తెస్తోంది తెలుసా?
X
క‌రోనా మ‌హ‌మ్మారితో క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్న‌ప్ర‌జ‌ల‌కు ఒకింత తీపిక‌బురు. ల‌క్ష‌ల కొద్ది రోగ‌గ్ర‌స్తులు...వేల‌కొద్ది మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న త‌రుణంలో ఓ గుడ్ న్యూస్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ త‌యారు చేస్తున్నామ‌ని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆక్స్‌ఫ‌ర్డ్ సైంటిస్టులు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ వ‌చ్చే స‌మ‌యాన్ని సైతం వెల్ల‌డించారు. వీట‌న్నింటి కంటే సంతోష‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే... ఈ వ్యాక్సిన్ త‌యారీలో భార‌తీయ కంపెనీ సైతం కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఇదే స‌మ‌యంలో మ‌న‌దేశంలోనూ మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డింది.

ఆక్స్‌ ఫర్డ్ సైంటిస్టుల అభిప్రాయం ప్ర‌కారం - మూడు ద‌శ‌ల్లో క్లినికల్ ట్రయల్స్ అనంత‌రం సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామ‌ని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ కు ముందే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇతర టెక్నాలజీతో తయారు చేసిన వ్యాక్సిన్లు రెండు లేదా ఎక్కువ డోసులు కావాలని - తాము తయారు చేసిన వ్యాక్సిన్ సింగిల్ డోస్ చాలని అన్నారు. ఏడు కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ తయారు చేస్తున్నమ‌ని తెలిపారు. బ్రిటన్ లో మూడు - యూరప్ లో రెండు - చైనా - ఇండియాలో ఒక్కో కంపెనీ త‌యారీలో భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు. క‌రోనాపై ఎఫెక్టివ్ గా పని చేసే వ్యాక్సిన్ కోసం వివిధ కంపెనీలు - దాతలతో కలిసి పని చేస్తున్నామ‌ని ఆక్స్‌ ఫ‌ర్డ్ వైద్యులు వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా, భార‌త్‌ లో ఇప్ప‌టికే వ్యాక్సిన్ రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క ముంద‌డుగు ప‌డిన సంగ‌తి తెలిసిందే. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌'(జీబీఆర్‌ సీ)కి చెందిన పరిశోధకులు కరోనా వైరస్‌ పూర్తి జన్యుక్రమాన్ని డీకోడ్‌ చేయడంలో విజయం సాధించారు. వైరస్‌కు చెందిన మూడు కొత్త ఉత్పరివర్తనాలను వారు గుర్తించారు. వైరస్‌ నిర్మూలనకు వ్యాక్సిన్‌ - ఔషధాలు తయారుచేసేందుకు ఇది దోహదపడుతుందని జీబీఆర్‌ సీ అధికారులు తెలిపారు.