Begin typing your search above and press return to search.
గుజరాత్ ఎన్నికలు ఎంత కీలకమంటే...
By: Tupaki Desk | 14 Dec 2017 9:41 AM ISTఇటీవల కాలంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత వేడి గుజరాత్ ఎన్నికల్లో కనిపించింది. మునుపెన్నడూ లేనట్లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుళ్లూగోపురాలు చుట్టేసి మరీ హిందూ ముద్ర కోసం తపించారు. తన వేషభాషల్లో రాజకీయ పరిణతి కనబరిచారు. ఆయనకు తోడుగా ‘హజ్’ టీం కూడా దొరకడంతో మరింత దూకుడు చూపించారు. అదే సమయంలో కాకలుతీరిన గుజరాత్ యోధుడు ప్రధాని మోడీ కూడా తన రాజకీయ చాతుర్యం మొత్తం చూపించారు. తనపై కాంగ్రెస్ వేసిన బాణాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో హార్దిక్ పటేల్ సెక్సు టేపుల రిలీజ్ వంటివన్నీ బీజేపీని - ఆయన్ను విమర్శలకు గురిచేశాయి. రెండు పార్టీలూ ఈ ఎన్నికలు ఎందుకంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.. భారత రాజకీయాల్లో ఈ ఎన్నికలకు ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడింది అంటే దానికి లెక్కలేనన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
20 ఏళ్లుగా బీజేపీకి విజయం అందిస్తున్న రాష్ర్టం అది. అంతేకాదు.. మోదీ ఎదుగుదలకు అన్ని రకాలుగా అందివచ్చిన రాష్ఱ్టమది. దాంతో అక్కడ అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ - ఎలాగైనా ఆ పార్టీని అడ్డుకోవాలని కాంగ్రెస్ రెండూ ఎవరికివారు పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ఆ తరువాత రోజురోజుకూ బలం పుంజుకొంటున్న మోదీ హవాను ఎలాగైనా అడ్డుకుని 2019లో తాము పుంజుకోకపోతే పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదముందన్నది కాంగ్రెస్ భయం. అందుకే... 2019 ఎన్నికలకు ముందు... 2018లో మరిన్ని రాష్ర్టాల ఎన్నికలకు ముందు వచ్చిన ఈ గుజరాత్ ఎన్నికలకు అంత ప్రాధాన్యమిస్తున్నారు.
బీజేపీ ఈ ఎన్నికలకు చాలా కీలకం.. 2014లో మోడీ ప్రభంజనంలో ఉత్తరప్రదేశ్ ను కూడా ఊడ్చేసినా ఆ వెంటనే ఢిల్లీలో చతికిలపడ్డారు. బీహార్లోనూ బోర్లా పడ్డారు. పంజాబ్ లో పట్టు సాధించలేకపోయారు. అదే సమయంలో ముందెన్నడూ లేనట్లుగా ఈస్ట్ - ఈశాన్య రాష్ర్టాల్లో బలం పెంచుకున్నారు. బెంగాల్ లో సీట్లు పెంచుకోగా అస్సాంలో ఏకంగా అధికారాన్నే అందుకోగలిగారు. ఇక ఒడిశానూ ఈసారి కొల్లగొట్టేస్తామని ధీమాగా ఉన్నారు. ఇదే జరిగితే దక్షిణాది రాష్ర్టాలు తప్ప మిగతా భారతదేశమంతా దాదాపుగా బీజేపీ చేతిలోకి వచ్చేస్తుంది. అంత అవకాశమున్నప్పుడు ప్రధాని మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షాలు ఇద్దరికీ సొంత రాష్ఱ్టమైన గుజరాత్ లో ఓడిపోతే ఎలా ఉంటుంది.. పరువు సబర్మతిలో కలిసిపోతుంది. 2019 ఎన్నికలకు వెళ్లే ముందు కాన్ఫిడెన్సు కరిగిపోతుంది. అందుకే మోడీ - అమిత్ షాలు ఈ ఎన్నికల విషయంలో అంత సీరియస్ గా ఉన్నారు.
మరోవైపు 2018లో ఛత్తీస్ గఢ్ - కర్ణాటక - మధ్యప్రదేశ్ - మేఘాలయ - మిజోరాం - నాగాలాండ్ - రాజస్థాన్ - త్రిపురలకు 2018లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. గుజరాత్ లో ఓడిపోతే ఆయా రాష్ర్టాల్లోనూ బీజేపీ కాన్ఫిడెన్సు తగ్గే ప్రమాదముంది.
ఇక కాంగ్రెస్ పరంగా చూసుకుంటే 22 ఏళ్లుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ ను ఆ పార్టీ చేతి నుంచి విడిపించగలిగితే అది కాంగ్రెస్‌కు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వ్యాపార ప్రధాన రాష్ర్టమైన గుజరాత్ వ్యాపారులు... కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా కొంత నష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో రాహుల్ అదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ ఎంతగా నష్టపరిచిందో వివరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. జీఎస్టీకి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనే కొత్త అబ్రివేషన్ కూడా ఇచ్చారు.
అంతేకాదు... మతపరంగా సెన్సిటివ్ రాష్ర్టమైన గుజరాత్ లో హిందూ ఓట్ల కోసం రాహుల్ అక్కడి ఆలయాలన్నీ తిరిగేశారు. ఆయన జంథ్యం వేసుకునే బ్రాహ్మణుడు అంటూ ఆ పార్టీ నేతలు మరింత కలరిచ్చారు. ఇన్ని మెట్లు దిగొచ్చినా రాహుల్ కు ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.
ఇంకో విషయం ఏంటంటే.. అధ్యక్ష పదవి అందుకుంటున్న సమయం కూడా ఇదే.. దీంతో ఇక్కడ గెలిస్తే రాహుల్ కు మంచి బోణీ పడినట్లే. గెలవకపోతే ఎప్పట్లా ఆయన ఖాతాలో మరో ఓటమి పడుతుంది. అయితే.. కాంగ్రెస్ కనుక గెలిస్తే ఆ ఖ్యాతి మొత్తం రాహుల్ కే వస్తుంది. కొత్తగా అధ్యక్షుడైన వేళ దక్కే విజయం ఎంతటి శక్తినైనా ఇవ్వొచ్చు.
మొత్తంగా చూసుకుంటే గత ఇరవయ్యేళ్లలో బీజేపీ ఎప్పుడూ ఇక్కడ ఇంత కష్టపడలేదు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ ఇక్కడ దెబ్బకొట్టింది. 150 సీట్లు వస్తే గొప్పే అని బీజేపీ నేతలే అంటున్నారు.
మరోవైపు గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ సరికొత్తగా కనిపించారు. వక్తగానూ ఆయన ఈసారి నిరూపించుకున్నారు.
గుజరాత్‌లో కొద్దికాలంగా కీలకంగా మారిన హార్దిక్ పటేల్ - అల్పేష్ ఠాకూర్ - జిగ్నేష్ మేవానీలను కాంగ్రెస్ తనవైపు తిప్పుకోవడం పెద్ద టర్నింగ్ పాయింట్. దీన్ని సుసాధ్యం చేసిన ఘనత రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ది.
అన్నిటికీ మించి గుజరాత్ ఎన్నికల్లో కనిపించిన ఇంకో ప్రధానాంశం ఏంటంటే... బీజేపీని హిందూ పార్టీగా ఇంతకాలం ముద్రేసిన కాంగ్రెస్ అదే హిందూ ముద్రకోసం ఈ ఎన్నికల్లో ఎంతగానో తపించడం స్పష్టంగా కనిపించింది.