Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌చారం గురించి విన్నారా? ఆశ్చ‌ర్యం బ్రో!!

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:58 AM GMT
గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌చారం గురించి విన్నారా?  ఆశ్చ‌ర్యం బ్రో!!
X
రోబోలు ఇప్పుడు మ‌న దేశంలోనూ వివిద రూపాల్లో సేవ‌లు అందిస్తున్నాయి. హోట‌ళ్ల‌లో స‌ర్వ‌ర్లు చేసే ప‌నులు చేస్తున్నాయి. అదేవిధంగా క్లాత్ షోరూంలలో వినియోగ‌దారుల‌కు దుస్తుల‌ను చూపిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు తాజాగా గుజ‌రాత్ ఎన్నిక‌ల్లోనూ ఒక రోబో సంద‌డి చేస్తోంది. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్సించేందుకు బీజేపీ అబ్య‌ర్థి చేసిన ఈ వినూత్న ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి అభ్యర్థులు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఖేడా జిల్లాలోని నడియాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పంకజ్‌భాయ్ దేశాయ్ ప్రచారంలో వినూత్నంగా డిజిటల్ రోబోను ఉపయోగిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న డిజిటల్ ఇండియాను సాకారం చేసేందుకు ఈ మార్గం ఎంచుకున్నారట‌ పంకజ్. డిజిటల్ రోబోతో బీజేపీ అభ్యర్థి చేస్తున్న ప్రచారం చూసి నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

నడియాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పంకజ్‌భాయ్ దేశాయ్ ఆరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రచారానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలనిఆయ‌న‌ నిర్ణయించుకున్నారు. ప్రచారం కోసం వెరైటీగా ఓ రోబోను తయారు చేయించారు.

వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలను రోబోతో పంపిణీ చేయిస్తున్నారు. పంకజ్భాయ్ చేస్తున్న రోబోటిక్ ప్రచారం నియోజకవర్గంలో బాగా ప్రాచుర్యం పొందింది.

2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సాంకేతికత వినియోగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందంజలో ఉన్నారు. అప్పట్లో ప్రచారానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అదే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు బీజేపీ నేతలు. సాంకేతిక‌త‌తో పోల్చుకుంటే బీజేపీనే ముందుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది క‌నుక స‌క్సెస్ అయితే.. మ‌న తెలుగు రాష్ట్రాల్లోనూ రోబోలు వ‌చ్చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.