Begin typing your search above and press return to search.
గిన్నిస్ రికార్డు..ఇన్ స్టాలో 4 గంటల్లో 10 లక్షల ఫాలోవర్స్
By: Tupaki Desk | 27 Sept 2020 5:40 PM ISTట్విట్టర్, ఫేస్బుక్ ,ఇన్ స్టాగ్రామ్ సోషల్ మీడియా ఏదైనా సినీ నటులు , క్రికెట్ ,టెన్నిస్ ,బ్యాడ్మింటన్ వంటి ఆటగాళ్లదే హవా. వాళ్ళను మించినోళ్లు లేరు. కానీ అప్పటివరకు సోషల్ మీడియాలో ఎటువంటి ఫాలోవర్స్ లేని వ్యక్తికి కేవలం ఒక్క వీడియో పది లక్షల మంది ఫాలోవర్స్ ని తెచ్చి పెట్టి గిన్నిస్ రికార్డు అందించింది. రెచ్చిపోతున్నారు . మామూలుగా ఇన్ స్టా లో ఫాలోవర్స్ లో రోజుకొక స్టార్ నయా రికార్డ్స్ నమోదు చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా మేమేమి తక్కువ కాదు అంటున్నారు . వారిని కూడా భారీగానే జనం ఫాలో అవుతున్నారు. రోజూ తమ దైనందిన కార్యక్రమాలపై అప్ డేట్లు ఇస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వీరిని లక్షల మంది ఫాలో అవుతున్నా అందుకు ఎన్నో రోజులు పట్టింది. భారత ప్రధాని మోదీ , అమెరికా అద్యక్షుడు ట్రంప్లను కూడా చాలా మంది ట్విట్టర్ , ,ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నారు. అయితే ఆ ఇద్దరితో పాటు సినీ , రాజకీయ నాయకులు దక్కించు కోలేని ఓ అరుదైన రికార్డును బ్రిటన్ కు చెందిన ఓ ప్రముఖుడు అందుకుని వీరందరినీ మించిపోయాడు. ఏకంగా ఇన్ స్టాలో గిన్నిస్ రికార్డు సాదించాడు.
బ్రిటన్ కు చెందిన దిగ్గజ ప్రసార కర్త డేవిడ్ అట్టేన్ బోరో ఓ అరుదైన ఘనత సాధించారు. ఆయన అలా ఇన్ స్టాలో అడుగు పెట్టారో లేదో ఇలా ఎవరూ ఊహించానటువంటి రికార్డు అందుకున్నారు . కేవలం నాలుగు గంటల వ్యవధిలో పది లక్షల మంది ఫాలో వర్స్ ని సొంతం చేసుకున్నారు. గిన్నిస్ లో ఇప్పటి దాకా జెన్నీఫర్ అనిస్టన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేశారు .అంతలా ఆయన్ని జనం ఫాలో అవడానికి కారణం.. ఆయన పోస్టు చేసిన వీడియో తెగ నచ్చడమే.మనమంతా భూగోళాన్ని కాపాడుకోవాలని ఆయన ఓ వీడియో అప్ లోడ్ చేయగా దానిని లక్షలాది మంది ఆసక్తిగా వీక్షించారు. ఆ వీడియోను ఇప్పటివరకూ కోటి నలభై లక్షల మంది చూశారు. దీంతో అట్టేన్ బోరో ఫాలో వర్స్ సంఖ్య కేవలం నాలుగు గంటల్లో పది లక్షల మందికి చేరింది.