Begin typing your search above and press return to search.

ఆ మ్యూజియంలో ‘టాయిలెట్’ స్పెషల్ అంట

By:  Tupaki Desk   |   24 April 2016 4:00 AM IST
ఆ మ్యూజియంలో ‘టాయిలెట్’ స్పెషల్ అంట
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. బాత్రూంలో కూర్చునే టాయిలెట్ షీట్ బంగారంతో తయారు చేయించటం కాస్త కొత్త మాటే. ఇలాంటివి విన్న వెంటనే.. బాగా బలిసినోళ్లు అలానే చేస్తారనటం..ఇంతకీ ఆ కుబేరుడు ఎవరో అన్న ఆసక్తికర ప్రశ్నలు ఉంటాయి. అయితే.. ఇలాంటి ప్రశ్నలు ఈసారి వేస్తే మాత్రం ఎవరూ ఊహించని సమాధానాలు రావటం ఖాయం.

ఎందుకంటే.. ఈ బంగారు టాయిలెట్ సాదాసీదా వాళ్ల కోసమే. బంగారంతో తయారు చేసిన టాయిలెట్ షీట్ ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బంగారు టాయిలెట్ షీట్ మీద కూర్చునే అద్భుత అవకాశాన్ని అమెరికాలోని ఒక మ్యూజియం కల్పిస్తోంది. 18 క్యారెట్లతో తయారు చేసిన ఈ బంగారు టాయిలెట్ మీద అవకాశం అమెరికాలోని గగన్ హామ్ మ్యూజియం కల్పిస్తోంది.

ఈ మ్యూజియంకు వచ్చే వారు ఈ బంగారు టాయిలెట్ ను వాడుకునే వీలుంది. ఇదంతా ఎందుకోసమంటే.. ప్రపంచలోని ఆర్థిక అసమానతల్ని తొలగించటం.. సంపద ఎవరో ఒక్కరికే సొంతం కాదన్న భావన కలిగించేందుకని మ్యూజియం నిర్వాహకులు చెబుతున్నారు. తాజా ఏర్పాటుతో ఇప్పుడీ మ్యూజియంకు వచ్చే వారిలో చాలామంది ఈ బంగారు టాయిలెట్ ను చూసేందుకు కూడా వస్తున్నారట.