Begin typing your search above and press return to search.
కొవిడ్ వేళ.. రూ.లక్ష కోట్ల మార్క్ దాటేశారు
By: Tupaki Desk | 2 March 2020 9:42 AM ISTఓవైపు ఆర్థికమందగమనం.. మరోవైపు కొవిడ్ 19 ప్రాణాంతక వైరస్.. ఇలా సమస్యల్ని ఒక్కసారిగా మీద పడినప్పుడు ఉండే ఆర్థిక తిప్పలు అన్నిఇన్ని కావు. పాలకుల వెన్నులో చలి పుట్టిస్తున్న పరిణామాల వేళ.. అంతో ఇంతో సానుకూల పరిణామం చోటు చేసుకుంటే పండుగ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు అలాంటిదే చోటు చేసుకుందని చెప్పాలి. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత కీలక ఆదాయవనరుగా మారిన జీఎస్టీ వసూళ్లు వరుసగా నాలుగో సారి రూ.లక్ష కోట్ల మార్క్ దాటటం ఆసక్తికరంగా మారింది.
ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.05లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది 8.3 శాతం ఎక్కువ. గడిచిన నాలుగు నెలల్లో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కును దాటేస్తున్నాయి. ఫిబ్రవరి వసూళ్లు జనవరి కంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. పరిస్థితి ఆశాజనకంగా ఉందనే చెప్పాలి. జనవరిలో వసూలైన జీఎస్టీ రూ.1.10 లక్షల కోట్లు అయితే.. ఫిబ్రవరి లో మాత్రంరూ.5వేల కోట్లు తక్కువగా నమోదైంది.
అయితే.. ఈ తగ్గింపును సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. జనవరిలో 31 రోజులు ఉంటే.. ఫిబ్రవరిలో 29 (ఈ ఏడాది లీపు సంవత్సరం కావటంతో) రోజులే. అంటే.. రెండు రోజులు తక్కువగా ఉండటం కూడా వసూళ్ల మీద ప్రభావాన్ని చూపిస్తాయన్నది మర్చిపోకూడదు. దీనికి తోడు.. జనవరిలో కొత్త సంవత్సరం సందర్భంగా ఉండే సందడి.. సంక్రాంతి సందర్భంగా జరిగే వ్యాపారాల్ని పరిగణలోకి తీసుకుంటే.. ఫిబ్రవరిలో నెలలో ఇలాంటివేమీ కనిపించవు.
దీనికి తోడు కొవిడ్ మహమ్మారి తీవ్రత జనవరి తో పోలిస్తే.. ఫిబ్రవరి లో భారీగా ఉందని చెప్పాలి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కును దాటేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. వసూలైన జీఎస్టీలో సీజీఎస్టీ కింద రూ.20,569 కోట్లు.. ఎస్ జీఎస్టీ కింద రూ.27,348 కోట్లు.. ఐజీఎస్టీ కింద రూ.48,503 కోట్లు.. సెస్ కింద రూ.8,947 కోట్లు వసూలైనట్లుగా చెబుతున్నారు. చుట్టూ ప్రతికూల వాతావరణం నెలకొని ఉన్న వేళ.. జీఎస్టీ వసూళ్లు పాలకులకు ఆశారేఖగా చెప్పక తప్పదు.