Begin typing your search above and press return to search.

యెగీలో పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   14 Jan 2022 8:30 AM GMT
యెగీలో పెరిగిపోతున్న టెన్షన్
X
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మారుతున్న సమీకరణలు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉండటంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లో టెన్షన్ పెంచేస్తోంది. గడచిన మూడు రోజుల్లో నలుగురు మంత్రులు, నలుగురు ఎంఎల్ఏలు బీజేపీకి రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోయారు. బీజేపీ నుంచి వచ్చేసిన వారిలో అత్యధికులు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

ఒక వైపేమో రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. మరో వైపేమో మంత్రులు, ఎంఎల్ఏలు వరసబెట్టి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రాజీనామాలు చేసిన వారిలో ఓబీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఎక్కువ మందున్నారు. స్వామి ప్రసాద్ మౌర్యా లాంటి వాళ్ళకయితే బీసీల్లో మంచి పట్టుంది. ఎప్పుడైతే బీసీ మంత్రులు, ఎంఎల్ఏలు బీజేపీకి రాజీనామాలు చేసి ఎస్పీలో చేరుతున్నారో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లో ఒక్కసారిగా జోష్ పెరిగిపోతోంది.

ఇంత మంది మంత్రులు, ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామాలు చేస్తారని బహుశా కమలనాథులు ఊహించలేదేమో. దాంతో ఏరోజు ఏ మంత్రి, ఏ ఎంఎల్ఏ రాజీనామా చేస్తారో అని టెన్షన్ తో ఎదురు చూడటంతోనే యోగీకి సరిపోతోంది. సిట్టింగుల్లో చాలా మందికి బీజేపీ టికెట్లు ఇవ్వదలచుకోలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. బహుశా అలాంటి వాళ్ళే పార్టీని వదిలిపోతున్నారనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

ఇదే నిజమైతే అలాంటి వాళ్ళు ఎస్పీలో చేరి బీజేపీకి చేయబోయే నష్టాన్ని కమలనాథులు అంచనా వేసినట్లు లేరు. దాంతో వాళ్ళని ఆపటానికి ఇపుడు టెన్షన్ పడుతున్నారు. అయితే బీజేపీ అగ్రనేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళదలచుకున్న మంత్రులు, ఎంఎల్ఏలు ఆగటంలేదు. దాంతో వాళ్ళని ఏమి చేసి పార్టీలోనే ఆపాలో తెలీక దిక్కులు చూస్తున్నది నాయకత్వం. ఇందులో భాగంగానే ప్రసాద్ మౌర్యపై ఏడేళ్ళ క్రితం కేసు బయటకు తీసి అరెస్టు వారెంటు జారీచేసింది. అయితే దీంతో కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. అందుకనే యోగీలో టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.