Begin typing your search above and press return to search.
పంచాయితీ తీర్పుపై పెరిగిపోతున్న సస్పెన్స్
By: Tupaki Desk | 19 Jan 2021 7:14 PM ISTపంచాయితీ ఎన్నికలు జరపాలా ? వద్దా ? ఇపుడిదే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ మొదలైంది కాబట్టి ఇప్పుడిప్పుడే పంచాయితి ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సిన్ కు ఎన్నికలకు సంబంధమే లేదుకాబట్టి ఎన్నికలు నిర్వహించవచ్చని స్టేట్ ఎన్నికల కమీషన్ వాదిస్తోంది. రెండువైపుల లాయర్ల వాదనలు విన్నతర్వాత డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. దాంతో సస్పెన్స్ పెరిగిపోతోంది అందరిలోను.
కమీషన్ ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారమైతే ఈనెల 17వ తేదీనుండి ఎన్నికల ప్రక్రియ మొదలుకావాల్సింది. అయితే కరోనా వైరస్ కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను కారణంగా చూపించి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేమని చెప్పింది. అయినా కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినకపోవటంతో కోర్టులో కేసు వేసింది. కోర్టు కూడా ఇరువైపులా వాదనలు విన్న తర్వాత వ్య క్సినేషన్ కార్యక్రమానికే ప్రాధాన్యతిచ్చింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమని కోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది.
అయితే సింగిల్ బెంచ్ తీర్పును నిమ్మగడ్డ సవాలు చేస్తు డివిజన్ బెంచ్ లో సవాలు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టు కూడా జోక్యం చేసుకునేందుకు లేదన్న నిమ్మగడ్డ వాదన కరెక్టేనా ? ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఎన్నికల నిర్వహించాలనే హక్కు నిమ్మగడ్డకుండా ? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కమీషన్ నోటిఫికేషన్ కరెక్టేనా ? అన్నది ఇపుడు కోర్టు తేల్చాల్సిన విషయం. మరి రెండు వైపులా వాదనలు విన్నతర్వాత చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి ఏమని తీర్పు చెబుతారనే విషయంలో సస్పెన్స్ పెరిగిపోతోంది. మరి తీర్పు ఎప్పుడు చెబుతారో చూడాల్సిందే.