Begin typing your search above and press return to search.

పెరుగుతోన్న కరోనా .. ఆక్సిజన్ బెడ్స్ నిల్ .. ఆగస్టు చివర్లో థర్డ్ వేవ్ !

By:  Tupaki Desk   |   16 July 2021 4:46 AM GMT
పెరుగుతోన్న కరోనా .. ఆక్సిజన్ బెడ్స్ నిల్ .. ఆగస్టు చివర్లో థర్డ్ వేవ్ !
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ , రోజురోజుకి కరోనా మహమ్మారి కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోతుంది. హైదరాబాద్ ఆస్పత్రులు మరియు జిల్లాలలో కోవిడ్ -19 కేసులు ఇటీవలికాలంలో తగ్గినప్పటికీ, ఆక్సిజన్ పడకలు మళ్ళీ కరోనావైరస్ రోగులతో ఫుల్ అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా కూడా ఆస్పత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ లెక్క వెయ్యి కేసుల కంటే తగ్గినప్పటికీ, యాక్టివ్ కేసులు మాత్రం 10,000 కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు అధికారులు. అందులో 4073 మంది ఇప్పటికీ ఆసుపత్రులలో కరోనా తో పోరాటం చేస్తున్నారు.

హైదరాబాద్‌ లో 12 ఆస్పత్రులు తమకు ఆక్సిజన్‌ పై గణనీయమైన సంఖ్యలో రోగులు ఉన్నట్లు చెబుతున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతోందని, కొన్ని ఆసుపత్రులలో పడకలు లేవని చెప్తున్నారు. కరోనా వైరస్ కేసులలో పెరుగుదల ఉన్నందున, పడకలు నిండడం ప్రారంభం అయ్యిందని ప్రజలందరి కోసం అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిషన్ రావు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రధాన కోవిడ్ -19 చికిత్స కేంద్రాలలో, నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 50 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, గాంధీ ఆసుపత్రిలో కొత్తగా 30 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

కరోనా పాజిటివ్ కేసులు, ప్రవేశాల పెరుగుదలను బట్టి, ఆసుపత్రిలో నాన్ కరోనా వైరస్ సేవలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. చెస్ట్ ఆసుపత్రిలో 14మంది ఆక్సిజన్ పడకలలో ఉండి చికిత్స తీసుకుంటూ ఉండగా , కింగ్ కోటి ఆసుపత్రిలో 39మంది ఆక్సిజన్ చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో 10మంది రోగులు ఆక్సిజన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆక్సిజన్ పడకలపై గణనీయమైన సంఖ్యలో రోగులతో నగరంలో మరో అరడజను ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. దీని బట్టి చూస్తే .. రాష్ట్ర ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్పారు.

ఇక దేశంలో సెకండ్ వేవ్ జోరు ఓ దశలో జోరుగా సాగింది. ఆ తర్వాత కరోనా కట్టడికి లాక్‌ డౌన్‌, వ్యాక్సినేషన్‌, కఠినమైన ఆంక్షలు తీసుకోవడం వల్ల కొంచెం కొంచెం గా అదుపులోకి వచ్చింది. అయితే, ఆగస్టు చివరిలో దేశంలో థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని ఐసీఎంఆర్‌ అంటు వ్యాధుల విభాగం అధిపతి డాక్టర్‌ సమీరన్‌ పండా చెప్తున్నారు. థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ, దాని తీవ్రత సెకెండ్ వేవ్ స్థాయిలో ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ ఛానల్‌కు గురువారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో థర్డ్‌వేవ్‌పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు కారణాల వల్ల థర్డ్ వేవ్ రావచ్చని, కరోనా మొదటి, రెండో వేవ్‌ సమయంలో అభివృద్ధి చెందిన రోగనిరోధక ఇమ్యూనిటీ బలహీనపడటం, ఇమ్యూనిటీకి టోకరా ఇవ్వగలిగిన, లేదా వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉన్న వేరియంట్లు ఉనికిలోకి రావడం, కరోనా ఆంక్షలు ఎత్తివేయడంలో తొందరపాటు కారణంగా మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

థర్డ్ వేవ్‌ కు డెల్టా ప్లస్ వేరియంట్ కారణం కానుందా అని ప్రశ్నించగా . డెల్టా వేరియంట్లు రెండూ ఇప్పటికే దేశంలో అలజడి సృస్టిస్తునట్టు తెలిపారు. కఠినమైన నియంత్రణ చర్యలతో థర్డ్‌ వేవ్‌ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన సూచించారు. అయితే, కరోనా నిబంధనలు ప్రజలు పట్టించుకోవడం లేదని, దీని వల్ల మరింత ప్రమాదం ఉండే ఉండే అవకాశం ఉందని అన్నారు. కరోనా హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవవద్దని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి అని చెప్పారు. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగించాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇంకా లాక్‌ డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా కట్టడి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది.