Begin typing your search above and press return to search.

కారు పార్టీలో ఈ లొల్లి ఏంది కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   23 Aug 2018 10:29 AM GMT
కారు పార్టీలో ఈ లొల్లి ఏంది కేసీఆర్‌?
X
ఓప‌క్క తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌మ్ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నిక‌ల్లో గెలుపు మీద మ‌స్తు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇంకోప‌క్క‌.. అధికార‌ప‌క్షంలోని నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త అంత‌కంత‌కూ త‌గ్గుతోంది. గ్రూపు త‌గాదాల‌తో కిందా మీదా ప‌డిపోతున్నారు. అధినేత అంటే అంద‌రికి భ‌యం భ‌క్తులు ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ వ‌ర‌కూ తాము.. పార్టీకి చెందిన సొంతోళ్ల మీద మండిప‌డుతున్నారు.

రోజురోజుకూ తెలంగాణ అధికార‌ప‌క్షంలో గ్రూపు రాజ‌కీయాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని చెప్పాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ కు వ్య‌తిరేకంగా పెన్ను క‌ద‌ల్చ‌టానికి పెద్ద‌గా ఇష్టం చూప‌ని పాత్రికేయులు.. ఒక‌వేళ ఒక‌రిద్ద‌రు చూపినా.. ముందు వెనుకా చూసుకోకుండా ఏది ప‌డితే అది రాసేయ‌ట‌మేనా?.. నువ్వు బ‌త‌క‌ట‌మే కాదు.. నిన్ను బ‌తికిస్తున్న సంస్థ‌ను కూడా బ‌తికించు నాయ‌నా? అంటూ ప్రైవేటు క్లాసుల గోల‌కు ఎవ‌రికి వారు త‌మ ప‌రిధుల్ని దాటేందుకు ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి.

అయితే.. ఇలాంటి తీరు పుణ్య‌మా అని టీఆర్ఎస్ కు లాభం సంగ‌తేమో కానీ.. న‌ష్టం మాత్రం భారీగా ఉంటుంద‌న్న అభిప్రాయాలు ప‌లువురి నోట వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం లేక‌పోలేదు. పార్టీలో న‌డిచే గ్రూపు రాజ‌కీయాల మీద అంత‌ర్గ‌త నివేదిక‌లు ఎంత వ‌చ్చినా.. మీడియాలో వ‌చ్చే క‌థ‌నాల కార‌ణంగా వ‌చ్చే కోపం రేంజ్ వేరేగా ఉంటుంది. ఇష్యూను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ క్లోజ్ చేయ‌ట‌మే కాదు.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తే.. మీకే న‌ష్ట‌మ‌న్న మాట అధినేత నోటి నుంచి వ‌చ్చే ప‌రిస్థితి.

అలా కాకుండా చాప కింద నీరులా అసంతృప్తి.. గ్రూపు త‌గ‌దాల లుక‌లుక‌ల‌తో గులాబీ పార్టీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు. ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాల్ని చూపిస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డికి.. అదే జిల్లాకు చెందిన ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి మ‌ధ్య న‌డుస్తున్న అధిప‌త్య పోరుతో జిల్లా పార్టీలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు. ఇరువురి గ్రూపుల మ‌ధ్య పార్టీ న‌లిగిపోతుంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.

తాజాగా నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువకు సాగునీటిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి న‌ల్గొండ ఎంపీ గుత్తా హాజ‌రు కావాల్సి ఉంది. కానీ.. రాలేదు. ఎందుకిలా అంటే.. మంత్రితో ఉన్న విభేదాలే కార‌ణంగా చెబుతున్నారు. ఎంపీ రాకున్నా.. మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ తో క‌లిసి సాగునీటిని విడుదల చేసేశారు. పైకి అంతా బాగానే ఉన్న‌ట్లు అనిపించినా.. లోలోన సాగుతున్న ఈ లుక‌లుక‌లు ఎన్నిక‌ల నాటికి సెట్ కాకుంటే పార్టీకి తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.