Begin typing your search above and press return to search.
హిజ్రాల గ్యాంగ్ వార్.ఒకరిని పెట్రోలు తగలబెట్టి చంపేశారు..
By: Tupaki Desk | 14 Oct 2020 12:00 PM ISTహిజ్రాల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. రెండు హిజ్రా గ్రూప్‌లు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఓ హిజ్రాను పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆమె చావు బతుకుల మధ్య వారంపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చివరికి కన్నుమూసింది. ఈ ఘటన హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. హంస అనే హిజ్రా గతంలో ఎర్రగడ్డలో ఉండేది. అయితే ఇటీవల ఆమె చందానగర్‌కు మకాం మార్చి అక్కడే నివసిస్తూ ఉండేది. చందా నగర్ కు చెందిన కొందరు హిజ్రాలు హంసకు ఆశ్రయమిచ్చారు. ఈ క్రమంలో ఎర్రగడ్డ, చందానగర్ హిజ్రాల గ్రూపుల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తున్నది. హంసను చందానగర్ నుంచి వెళ్లిపోవాలని చందానగర్ గ్రూప్ ఆదేశించింది. ఆమె వినకపోవడంతో తీవ్ర వివాదం చెల రేగింది. ఈ క్రమం లో గత మంగళవారం రాత్రి చందా నగర్ లో ఉండే హిజ్రాల గ్రూప్ కు.. ఎర్రగడ్డ హిజ్రాల గ్రూప్ నకు తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ క్రమం లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి.
అయితే హంసకు చందానగర్ గ్రూప్ హిజ్రాలు హంసను పెట్రోలు మాట్లాడుకుందామని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రాంతానికి రమ్మని చెప్పి ఒంటరిగా వచ్చిన ఆమెపై పెట్రోలు పోసి తగలబెట్టారు. తీవ్ర గాయాలపాలైన హంసను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా .. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. చందానగర్ హిజ్రా గ్రూప్ కు చెందిన సదా ఆమె భర్త శంకర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలంగాణ ట్రాన్స్ జెండర్ సంఘం ఆరోపిస్తోంది. 30 నుండి 40 మంది హంస పై దాడికి పాల్పడ్డారని.. పైగా ఆమె ఆత్మహత్య చేసుకున్నదని ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. హంస ఆత్మహత్యాయత్నం చేసింది అన్నది అబద్ధమని వారంటున్నారు. కొందరు మగవాళ్లు హిజ్రాల వేషం వేసి డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు.