Begin typing your search above and press return to search.
పోలవరం పై కొత్త ఆదేశాలు జారీచేసిన గ్రీన్ ట్రైబ్యునల్ !
By: Tupaki Desk | 20 Feb 2020 4:45 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ముంపు ప్రాంతాల నివేదికలను ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డుకు ఇవ్వాలని హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. గతంలో పిటీషనర్ కు వివరాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ, ఇంకా ఆ వివరాలని ఇవ్వక పోవడం పై గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ వివరాలతో పాటుగా పోలవరం ముంపు ప్రాంతాల నివేదికలను కూడా తమకు అందజేయాలని జాతీయ హరిత ట్రిబ్యూనల్ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఆదేశాలిచ్చింది. పోలవరం డ్యాం ఎత్తు పెంపు తో కలిగే ముంపుపై స్పష్టమైన సమాచారం ఇప్పటి వరకు ఇవ్వలేదని పిటీషన్ తరపు న్యాయవాది శ్రావణ్... జస్టిస్ ఏ కే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆ నివేదికలను ఎన్జీటీతో పాటూ, పిటీషనర్ కు అందించాలని తెలిపింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ ను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.