Begin typing your search above and press return to search.

జపాన్ సాహసం.. కరోనాలో ఒలింపిక్ జ్యోతి

By:  Tupaki Desk   |   20 March 2020 11:30 AM GMT
జపాన్ సాహసం.. కరోనాలో ఒలింపిక్ జ్యోతి
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు చైనా పక్కనుండే జపాన్ లోనూ అతలాకుతం చేస్తోంది. కరోనా కారణంగా జపాన్ లో జరిగే టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడుతాయని అందరూ భావించారు.

అయితే ఎన్ని ఊహాగానాలు వచ్చినా జపాన్ మాత్రం సాహసమే చేసింది. ఒలింపిక్స్ కు ప్రధాన ఘట్టమైన ‘ఒలింపిక్ జ్యోతి’ని జపాన్ అందుకుంది.

గురువారం ఎథెన్స్ లో జరిగిన కార్యక్రమంలో గ్రీసు దేశం నుంచి జపాన్ టోక్యో 2020 నిర్వాహకులకు జ్యోతిని అందించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ముగించారు.

1896లో తొలి ఆధునిక ఒలింపిక్స్ ను కాగడా అంటుపెట్టి జ్వలింపచేశారు. అప్పటి నుంచి ఈ ఒలింపిక్ జ్యోతి ఏ దేశం నిర్వహిస్తే ఆ దేశం అందుకుంటుంది.

తాజాగా జపాన్ దేశం తరుఫున 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో పోటీపడిన స్విమ్మర్ నవోకో ఇమాటో ఈ ఒలింపిక్ జ్యోతిని అందుకున్నారు. ఆ తర్వాత దాన్ని వెలిగించారు. గ్రీసులో జ్యోతిని వెలిగించి ఆతిథ్య జపాన్ దేశానికి అందించారు. ఈ శుక్రవారం ఒలింపిక్ జ్యోతి టోక్యోకు చేరనుంది. జపాన్ లో ఈనెల 26న పుకుషిమాలో ఈ జ్యోతి తో పాటు క్రీడలు ఆరంభమవుతాయని జపాన్ ప్రకటించింది.