Begin typing your search above and press return to search.
గ్రేటర్ పోరు : మధ్యలోనే ముగిసిన అమిత్ షా రోడ్ షో ... ఎందుకంటే ?
By: Tupaki Desk | 29 Nov 2020 10:20 PM ISTజీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ నగరం మొత్తం కాషాయమయమైపోయింది. ప్రచారానికి చివరి రోజు అయిన ఆదివారం ప్రచారాన్ని బీజేపీ నేతలు హోరెత్తిస్తున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించి బీజేపీలో కొత్త జోష్ తీసుకువచ్చాడు. అమిత్ షా రోడ్ షోకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రోడ్ షో నెమ్మదిగా ముందుకు కదలడంతో మధ్యలోనే ముగించారు. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ వరకు సాగాల్సిన రోడ్ షో నామాలగుండు వద్దే మధ్యలోనే ముగిసిపోయింది.
అమిత్ షా రోడ్డు షో కోసం బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం, అంతకంటే పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు రోడ్లపైకి రావడంతో ప్రచార రధం నెమ్మదిగా కదిలింది. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ వరకు సాగాల్సిన రోడ్‌షో.. మధ్యలో నామాలగుండు వద్దే ఆగిపోయింది. అక్కడ ఆ వాహనాన్ని దిగి కారులో నాంపల్లికి వెళ్లిపోయారు అమిత్ షా. అయితే, రోడ్ షోలో అమిత్ షా ప్రసంగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, వారాసిగూడ నుంచి నామాలగుండు దాకా ఎక్కడా ఆయన మాట్లాడలేదు. మరికాసేపట్లో అమిత్ షా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రసగించనున్నారు.
దీనికి మరో కారణం కూడా ఉంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆ సమయంలోగా బయటి ప్రాంతాల నాయకులు నగరం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. షా గనుక రోడ్ షో కొనసాగించి ఉంటే, నాంపల్లిలో ప్రెస్ మీట్ కుదరదు. సాయంత్రం 5 తర్వాత కూడా సిటీలో ఉంటే ఆ చర్యను ప్రతిపక్షాలు, ఎన్నికల సంఘం తప్పుపట్టే అవకాశాలు లేకపోలేదు. దీనితో మధ్యలోనే రోడ్ షో ముగించేశారు. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న కాషాయ దళం..దాన్ని అలాగే కొనసాగించాలని పక్కాగా వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర నేతలతో పాటు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను రంగంలోకి దించింది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 4 కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించబోతున్నారు.