Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఫైట్: 50శాతం పోలింగ్.. 20శాతం ఓట్లతోనే గెలుపు
By: Tupaki Desk | 23 Nov 2020 2:00 PM ISTప్రతీసారి అంతే.. గ్రేటర్ ఓటరు చాలా లేజి. ఓటు వేయడానికి బద్దకిస్తాడు. ఐదేళ్ల పాటు మన సమస్యలు పరిష్కరించే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి హైదరాబాదీలు అస్సలు ముందుకురారు. మొత్తం ఓటర్లలో కేవలం 50శాతానికంటే ఎక్కువ ఎప్పుడూ దాటదంటే అతిశయోక్తి కాదు.. కేవలం 20-23శాతం ఓటర్లు ఎన్నుకున్న వ్యక్తులు కూడా ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు.
గ్రేటర్ లో ఓటు తక్కువగా నమోదుకావడంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఐదేళ్ల పాటు సమస్యలు పట్టించుకోవడం లేదు. అడిగేవారు ఉండడం లేదు.. ఇందుకు కారణంగా ఓటర్లు ఓటు వేయకపోవడమే.. ముఖ్యంగా విద్యావంతులైన ఓటర్లలో నిరాసక్తత కనిపిస్తోంది. పోలింగ్ రోజున సెలవు ఇచ్చినా అత్యధికులు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రావడం లేదు.
2012 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 41.22శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని డివిజన్లలో కేవలం 15శాతం ఓటు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27శాతం మాత్రమే ఓటేశారు. ఇందులో బస్తీల్లోని నిరుపేదలే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, సంపన్నులు అసలే పోలింగ్ కేంద్రాలకు రాలేదు.
సంపన్న వర్గాలు ఉండే మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, చందా నగర్, ఫిల్మ్‌నగర్, షేక్‌పేట, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ప్రతి ఎన్నికల్లోనూ 50 శాతం కూడా పోలింగ్ కూడా నమోదు కావడం లేదు.మురికివాడలు, మధ్యతరగతి ప్రజలు ఉండే సికింద్రాబాద్, పాతబస్తి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ లో మాత్రం ఓటింగ్ గరిష్టంగా ఉంటోంది.
ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా గ్రేటర్ ఓటరు గడప దాటి ఓటేయకపోవడమే ఇక్కడ ప్రజాస్వామ్యానికి పెను విఘాతంగా మారింది.