Begin typing your search above and press return to search.

క్యాన్సర్ పరిశోధనల్లో గొప్ప పురోగతి: చికిత్సకు మార్గం సులువు

By:  Tupaki Desk   |   16 July 2020 2:30 PM IST
క్యాన్సర్ పరిశోధనల్లో గొప్ప పురోగతి: చికిత్సకు మార్గం సులువు
X
మానవులకు ప్రాణాంతకంగా మారిన కేన్సర్ పై శాస్త్రవేత్తలు పైచేయి సాధించారు. ఆ వ్యాధిపై చేస్తున్న విస్తృత పరిశోధనలు అద్భుతమైన పురోగతి లభించింది. ఈ వ్యాధి వ్యతిరేక పోరాటంలో శాస్త్రవేత్తలు విస్తృతంగా చేస్తున్న పరిశోధనలు.. ప్రయోగాల్లో ఇదే గొప్ప పురోగతి. క్యాన్సర్‌ కణాలను శరీరంలో చంపగల ఫ్యాటీ ఆసిడ్స్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డిహోమో-గామా-లినోలెనిక్ ఆమ్లం లేదా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తాజా పరిశోధనలో తేలడం వైద్య పరిశోధనల్లో గొప్ప పరిణామంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు చెబుతున్నారు.

మానవ శరీరంలో డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం క్యాన్సర్ కణాలలో ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఫెర్రోప్టోసిస్‌ అంటే దెబ్బతిన్న లేదా పనిచేయని కణాలు సురక్షితంగా, సమర్ధవంతంగా నాశనం చేయడం లేదా రీసైకిల్ చేయడంగా శాస్త్రవేత్తలు చెబుతారు. ఇనుము (ఫెర్రో) ను ఉపయోగించే అత్యంత నియంత్రిత సెల్ డెత్ ప్రోగ్రామ్‌ను ఫెర్రోప్టోసిస్ వైద్య పరిభాషలో అంటారు. 2012లో శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పీయూఎఫ్ఏ), డీజీఎల్‌ఏ ఆమ్లం ఉండే ఆహారం తీసుకుంటే జంతువులతో పాటు మానవులలోని కేన్సర్‌ కణాలలోనూ ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఈ డీజీఎల్‌ఏను కచ్చితంగా కేన్సర్‌ కణంలోకి పంపగలిగితే అది ఫెర్రోప్టోసిస్‌ను ప్రోత్సహిస్తుందని.. దానిద్వారా కణితిలోని కేన్సర్‌‌ కణాలను హరించి వేస్తుందని పరిశోధకులు చేసిన పరిశోధనల్లో గుర్తించారు.

ఫెర్రోప్టోసిస్‌ ద్వారా మూత్రపిండాల సంబంధిత వ్యాధులు, న్యూరోడీజెనరేషన్ వ్యాధుల వంటి పరిస్థితులపై కూడా అధ్యయనం చేస్తున్నట్లు వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాట్స్ తెలిపారు. ‘డెవలప్‌మెంటల్ సెల్‌’ లో ఈ అధ్యయనానికి సంబంధించి ప్రచురితమైంది. నెమటోడ్ కేనోరబ్డిటిస్ ఎలిగాన్స్‌ ద్వారా జంతువుల్లో డీజీఎల్‌ఎతో సహా ఇతర ఆహార కొవ్వుల ప్రభావంపై దాదాపు రెండు దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు.

ఈ ఆవిష్కరణకు క్యాన్సర్‌కు సంభావ్య చికిత్స దిశగా ఒక అడుగుపడింది. దీంతోపాటు కొన్నిచిక్కులు కూడా ఉన్నాయని చెప్పడం కొంత ఆందోళన రేపుతోంది. సీ ఎలిగాన్స్ అనేది మైక్రోస్కోపిక్ వార్మ్‌ అనేది సెల్‌ యాక్టివిటీ అధ్యయనంలో పారదర్శకంగా ఉండే దీనిని ఉపయోగిస్తారు. నెమటోడ్లకు ఈ ఆహారం ఇవ్వడంతో డీజీఎల్‌ఏతో నిండిన బ్యాక్టీరియా.. అన్ని బీజ కణాలతో పాటు బీజ కణాలను తయారుచేసే మూల కణాలను కూడా చంపినట్లు కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన ద్వారా మానవ కణాలకు సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకుల బృందం స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కాట్ డిక్సన్‌తో కలిసి మరింత అధ్యయనం చేశారు. ఈ బృందం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది.