Begin typing your search above and press return to search.

వైరస్ పై దేశ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చే వార్త

By:  Tupaki Desk   |   28 May 2020 5:15 AM GMT
వైరస్ పై  దేశ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చే వార్త
X
దేశ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చే వార్త ఇదీ.. మహమ్మారి వ్యాపించే వేగం దేశంలో తగ్గుతోంది. కేసుల వృద్ధి రేటు రెండు రోజులుగా 5శాతం లోపే ఉండడం ఊరట కలిగిస్తోంది. ఇలానే సాగితే దేశం కరోనా నుంచి విముక్తి కలగడం ఖాయమనే భరోసా నెలకొంది.

దేశంలో వరుసగా ఆరోరోజు కూడా 6వేలకు పైగా కేసులు వెలుగుచూవాయి. గత 24 గంటల్లోనూ 6387 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. కొత్తగా 3935మంది కోలుకోగా.. 170మంది మరణించారు. తాజా మరణాల్లో 80శాతం మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలోనే కావడం మిగతా దేశానికి వైరస్ వ్యాప్తి వేగంగా లేదని అర్థమవుతోంది. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో భారీ కేసులు నమోదయ్యాయి.

వచ్చే జూన్ 17 నాటికి దేశంలో కేసుల సంఖ్య 502470కి చేరుతుందని ఢిల్లీ ఐఐటీ పరిశోధక బృందం తెలిపింది. తెలంగాణలో జూన్ 17నాటికి 2451కి, ఏపీలో 703కి చేరుతుందని తెలిపింది. దేశంలో ఒక్కో వైరస్ బాధితుడు కనిష్టంగా 0.03మంది నుంచి ఐదుగురికి వైరస్ ను అంటిస్తున్నాడని బృందం అంచనావేసింది.

దేశమంతటా వైరస్ ఉధృతి ఒకేలా ఉండకుండా భిన్నంగా ఉండడం సానుకూలాంశంగా ఉంది. ఇప్పటి వరకు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మహమ్మారి విస్తరించింది. మొత్తం కేసుల్లో 87శాతం పైగా కేవలం 10 రాష్ట్రాల్లో ఉండడం మిగతా రాష్ట్రాలకు ఉపశమనంగా మారింది.

తెలంగాణలో సంక్రమణ రేటు ఒక్క వైరస్ బాధితుడి వల్ల 1.54 ఉండగా.. అదే ఏపీలో కేవలం 0.86గా ఉండడం విశేషం. దీన్ని బట్టి వైరస్ వ్యాపించే వేగం తగ్గుతోందని.. తొందరలోనే దీన్ని బయట పడుతామన్న విశ్వాసం కలుగుతోందని పరిశోధకులు అంచనావేస్తున్నారు.