Begin typing your search above and press return to search.

న్యూజెర్సీలో బ్యాంకు కుంభకోణం .. 17 మిలియన్లు మోసం చేసిన భారతీయుడు !

By:  Tupaki Desk   |   17 Sep 2020 1:30 PM GMT
న్యూజెర్సీలో బ్యాంకు కుంభకోణం .. 17 మిలియన్లు మోసం చేసిన భారతీయుడు !
X
అమెరికాలో బ్యాంకును లక్షల డాలర్ల మేరకు మోసగించిన కేసులో ఓ భారతీయ అమెరికన్‌ దోషిగా తేలాడు. న్యూజెర్సీకి చెందిన మార్బుల్, గ్రానైట్‌ వ్యాపారి రాజేంద్ర కంకారియా ఆర్థిక నేరానికి పాల్పడినట్లు కోర్టులో వెల్లడైంది. ఈయన ప్రస్తుతం మూతపడిన లోటస్‌ ఎగ్జిమ్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఉండేవారు. కాగా, ఆయనకు ఆ సంస్థలో వాటాలున్నాయి. ఓ అమెరికన్ బ్యాంకు నుంచి అక్రమంగా రుణం పొందేందుకు మార్చి 2016 నుంచి మార్చి 2018 మధ్య కాలంలో తన ఉద్యోగుల సహకారంతో పక్కా ప్రణాళికను అమలు చేశారు. హామీగా ఇచ్చేందుకు తగినన్ని స్థిరాస్తులు లేని నేపథ్యంలో కంకారియా సంస్థ ఉద్యోగుల సహకారంతో ఆన్ ‌లైన్‌ మోసానికి పాల్పడ్డారు.

దీనిలో భాగంగా సంస్థ ఉద్యోగులే తమ వినియోగదారుల పేరుమీద నకిలీ ఇ మెయిల్‌ ఖాతాలు తెరిచారు. సంస్థను గురించి బ్యాంకు, ఆడిటర్లకు తాము లోటస్‌ సంస్థకు భారీ మొత్తాలు బకాయి ఉన్నామని, వాటిని త్వరలోనే చెల్లిస్తామని సమాచారం ఇచ్చారు. ఇది నిజమని భావించిన బ్యాంకు సంస్థకు రుణాలు మంజూరు చేసింది. ఈ లావాదేవీలో బ్యాంకుకు 17 మిలియన్ డాలర్ల (రూ.1,251,922,500) నష్టం సంభవించిందని అమెరికా న్యాయస్థానంలో రుజువు అయింది. ఈ నేరానికి గాను కోర్టు రాజేంద్ర కంకారియాకు గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించే అవకాశముంది.