Begin typing your search above and press return to search.
ప్రపంచ దేశాలకు మింగుడుపడని రీతిలో ఆ ప్రముఖుడి అంచనా!
By: Tupaki Desk | 3 July 2020 5:00 AM ISTమహమ్మారి ప్రభావం ఎప్పటివరకూ ఉంటుంది? గతంలో మాదిరి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా రెస్టారెంట్లకు వెళ్లి మిడ్ నైట్ బిర్యానీలు.. రోడ్డు పక్కన ఉండే బండిలో అమ్మే వేడివేడి పన్నీరు దోసె లాంటి రోజులు ఎప్పుడన్న విషయంపై ఒక్కొక్కరి అంచనా ఒక్కోలా ఉంటుంది. చాలామందికి పాత రోజులు కొద్ది నెలల్లో వచ్చేస్తాయన్న అంచనాను వేస్తుంటారు. కానీ.. వాస్తవం అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు.
చాలామంది అంచనా వేసినట్లు.. అక్టోబరు నాటికి పరిస్థితుల్లో మార్పులువస్తాయని.. వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న దానిలో నిజం లేదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి కాస్త మెరుగుపడాలంటే.. కనీసం 2021 ఫిబ్రవరీ వరకూ పడుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనలో పస ఉందన్న విషయాన్ని తేల్చటమే కాదు.. ఇప్పుడున్న గడ్డుపరిస్థితుల నుంచి మార్పు అంత తేలికగా రాదన్న విషయం స్పష్టమవుతుంది.
ఆస్ట్రేలియాకుచెందిన ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీ ఫ్లైట్ సెంటర్ సీఈవో గ్రహం టర్నర్ ఆసక్తికర అంశాల్ని వెల్లడించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. గతంలో మాదిరి అంతర్జాతీయంగా పర్యాటకం డెవలప్ కావాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ఏదైనా దేశానికి వెళ్లాలంటే పదిహేను రోజులు క్వారంటైన్ ఉండాలి. దీంతో.. విమానం ఎక్కిన ప్రతిఒక్కరూ కనిష్ఠంగా పదిహేను రోజులు.. గరిష్ఠంగా ముప్ఫై రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరూ విదేశీ పర్యటనలు చేయాలని భావించరని ఆయన పేర్కొన్నారు.
ఈ తరహా పరిమితులు ఎత్తి వేసినకొన్ని నెలల తర్వాత మాత్రమే ప్రపంచ పర్యాటకంలో మార్పువచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రపంచ పర్యాటకం లాక్ డౌన్ ముందు పరిస్థితికి 18నెలలు పడుతుందని.. అదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకోవటానికి మూడేళ్లు పడుతుందని చెప్పారు. దీంతో.. పర్యాటకం మీద ఆశలు పెట్టుకునే దేశాలకు.. సంస్థలకు తాజా మాట షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు.