Begin typing your search above and press return to search.

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు వీరే.. డిసైడ్ చేసిన బాబు

By:  Tupaki Desk   |   3 Sept 2022 4:37 PM IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు వీరే.. డిసైడ్ చేసిన బాబు
X
మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం మూడు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో రెండుస్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను డిసైడ్ చేసిన ఆయన.. మరో పేరును త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్లకు గడువు దగ్గర పడే వరకు అభ్యర్థుల కసరత్తు చేస్తూ ఉండే చంద్రబాబు.. ఉరుకు ముందే అభ్యర్థుల పేర్లను వెల్లడించటం ద్వారా తన రోటీన్ తీరుకు భిన్నంగా వ్యవహరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అంతేకాదు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల విషయానికి వస్తే పశ్చిమ రాయలసీమకు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిగా.. తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ పేరును ప్రకటించారు.

విశాఖ స్థానానికి జరిగే ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి పేరును ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఏపీలో పొత్తులపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించిన ఆయన.. సమాయానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని.. ఎవరో ఏదో ప్రచారం చేస్తే దానిపై స్పందించటం సరికాదన్నారు.

పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని స్పష్టం చేసిన చంద్రబాబు.. పొత్తుల గురించి నాయకుల్లో స్పష్టత ఉండాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజల్లో ఉండాలని.. వారి సమస్యలపై స్పందించాలన్నారు.

చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలన్న ఆయన.. తనను తాను మార్చుకుంటానని చెప్పటం గమనార్హం. మొత్తానికి తన తీరులో వస్తున్న మార్పుల్ని చేతల్లోనే కాదు.. మాటల్లోనూ చెబుతున్న బాబు రానున్న రోజుల్లో మరెన్ని మార్పులు చూపిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.