Begin typing your search above and press return to search.

అమ్మో... ఆయన ఫోనా?

By:  Tupaki Desk   |   14 Dec 2016 7:42 AM GMT
అమ్మో... ఆయన ఫోనా?
X
ఏపీలో అధికారులు ఒక ఫోన్ నంబర్ చూసి జడుసుకుంటున్నారు. తమ మొబైల్ స్క్రీన్లపై ఆ నంబరు కనిపిస్తే చాలు ముఖం చిట్లిస్తున్నారు. ఆ నంబరు ముఖ్యమంత్రిది - ఆయన కార్యాలయానిది.. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి నుంచి ఫోన్ అంటే అధికారులు సంబరపడతారు. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితి వేరు. సీఎం ఫోన్ చేశారంటే చాలు అధికారులు విసుక్కుంటున్నారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచీ టెలీ కాన్ఫ‌రెన్సుల పేరుతో విలువైన స‌మ‌యం గ‌డిచిపోతుంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. సిఎం కు ఎపుడు మూడ్ వ‌స్తే అపుడు టెలీకాన్ఫ‌రెన్సు అంటారు, ఏదో ఒక‌టి మాట్లాడ‌తారు. ఒక‌రిద్ద‌రితో మాట్లాడ‌టం కోసం రాష్ర్టంలో ఉన్న అంద‌రు అధికారులూ ఫోన్‌ లో ఆన్‌ లైన్‌ లో ఉంచ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిటి? అని అధికారులు ఆవేద‌న చెందుతున్నారు.

అందులోనూ ఈ శీతాకాలంలో మరీ ఇబ్బంది పడుతున్నారు. తెల్లారి లేచేస‌రికి ముఖ్య‌మంత్రి ఫోన్…. ఇంకా రోజువారీ కార్య‌క్ర‌మాలు ఎలా పూర్తి చేసుకోవాలి? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఫోనీ ముఖ్య‌మంత్రి ఫోనులో అత్య‌వ‌స‌ర స‌మాచారం - ఉప‌యోగ‌ప‌డేది ఏమైనా ఉందా అంటే అలాంట‌దేమీ ఉండ‌దు. రోజువారీ అంశాలు..రొటీన్ వ్య‌వ‌హారాలు మాత్ర‌మే ఉంటాయి. అలాంటి వాటికీ ఫోన్లో గంట‌ల కొద్దీ స‌మ‌యం తినేయాలా? అని అధికారులు ఆవేద‌న‌చెందుతున్నారు. అయితే... చంద్రబాబు ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అంటున్నారు. అధికారులను ఖాళీగా ఉంచరాదని.. నిత్యం తనతో టచ్ లో ఉండేలా చూసుకోవాలన్నది ఆయన ప్లానుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వం వైఫల్యాలతో నడుస్తోంది. ఇలాంటి సమయంలో అధికారులనూ - నాయ‌కులు ఖాళీగా ఉంటే మీడియాతోనో - ఇంకెవరితోనో మాట్లాడితే ఇబ్బందని... అందుకే వారిని ఎక్క‌డా ఖాళీగా ఉండ‌కుండా, వారికి మ‌రో ఆలోచ‌న లేకుండా చేయ‌డం ద్వారా ముఖ్య‌మంత్రి అన్నీ కప్పుకొస్తున్నారని టాక్. అయితే.. చంద్రబాబు వేసిన ఈ ప్లాను వికటిస్తోంది. చంద్రబాబు చెప్పే సోది వినలేక అధికారులు రగిలిపోతూ మీడియా వద్ద గగ్గోలు పెడుతున్నారు. దీంతో చంద్రబాబు ఏదైతే జరగకూడదనుకుంటున్నారో అదే జరుగుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/