Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల‌కు చుక్క‌లు చూపిస్తున్న అధికారులు!

By:  Tupaki Desk   |   27 July 2019 6:00 AM GMT
ఏపీ మంత్రుల‌కు చుక్క‌లు చూపిస్తున్న అధికారులు!
X
ఏపీ మంత్రుల‌కు షాకింగ్ అనుభ‌వాలు ఎదురవుతున్నాయి. ఇప్ప‌టికే ఒక‌ట్రెండుసార్లు మంత్రులుగా ప‌ని చేసిన వారికి ఫ‌ర్లేదు కానీ.. కొత్త‌గా మంత్రులైన వారికి మాత్రం ఉన్న‌తాధికారులు చుక్క‌లు చూపిస్తున్నారు. అధినేత ల‌క్ష్యాన్ని అందుకునేందుకు వీలుగా ప‌రుగులు తీస్తుంటే.. అధికారుల్లో కొంద‌రైతే వారితో ప‌రుగులు తీయ‌టం త‌ర్వాత‌.. క‌నీసం న‌డ‌వ‌నుకూడా న‌డ‌వ‌ట్లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అధికారుల తీరుతో ప‌లువురు మంత్రులకు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తాజాగా.. ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూల‌పు సురేష్ తో భేటీ అయ్యేందుకు ఆస్ట్రేలియా ప్ర‌తినిధి బృందం వ‌చ్చింది. విద్యారంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌న్న ఆలోచ‌న‌తో వారు మంత్రిని క‌లిశారు.

అయితే.. ఆస్ట్రేలియా ప్ర‌తినిధి బృందం వ‌స్తున్న స‌మాచారాన్ని మంత్రికి ముందుగా ఎవ‌రూ అందించ‌లేదు. తీరా వారు వ‌చ్చాక‌.. ఏ ప‌ని మీద వచ్చారు? ఏమేం మాట్లాడాల‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌టంతో ఆయ‌న కిందామీదా ప‌డిన ప‌రిస్థితి. స‌రే.. స‌ద‌రు విద్యాశాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారులైనా వ‌చ్చారా? అంటే.. అది లేదు. ఒక విదేశీ ప్ర‌తినిధి బృందం మంత్రిని క‌లిసేందుకు వ‌చ్చిన‌ప్పుడు క‌నీసం స‌ద‌రు శాఖ ప్రిన్సిపుల్ సెక్ర‌ట‌రీతో పాటు.. ఇత‌ర ఉన్న‌తాధికారులు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాలి.

కానీ.. అలాంటిదేమీ లేదు. దీంతో.. ఎజెండా ఏమిటి? ప్ర‌తినిధి బృందానికి ఏం చెప్పాలి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. అస‌లు ఎందుకు వ‌చ్చారో క‌నీస స‌మాచారం లేకుండా మీటింగ్ ఎలా పెడ‌తారంటూ ఆయ‌న త‌న ఓఎస్డీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు. మంత్రివ‌ర్యుల స‌మ‌య‌స్ఫూర్తితో వారితో మామూలుగా మాట్లాడి పంపించేశారు. స‌రైన ప్లానింగ్ లేకుండా ఇలా స‌మావేశాల్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటూ త‌న ఓఎస్డీకి క్లాస్ పీకిన‌ట్లుగా స‌మాచారం.

మేనేజ్ చేసుకోగ‌లిగారు కాబ‌ట్టి ప‌రువు పోలేదు. లేదంటే విదేశీ ప్ర‌తినిధి బృందం ద‌గ్గ‌ర రాష్ట్ర ఇమేజ్ ఎంత దారుణంగా ఉంటుంద‌న్న ఆగ్ర‌హాన్ని మంత్రి వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇంత‌కీ.. ఇలాంటి ప‌రిస్థితి ఎందుకొచ్చింద‌న్న విష‌యాన్ని ఆరా తీస్తే.. సీనియ‌ర్ మంత్రులు త‌ప్పించి.. మిగిలిన వారి వ‌ద్ద ప‌ని చేస్తున్న ఉన్న‌తాధికారులంతా ప్ర‌భుత్వ పెద్ద‌కు ట‌చ్ లో ఉంటే స‌రిపోతుంది.. మంత్రుల్ని ప‌ట్టించుకోవాల‌న్న భావ‌న‌లోకి వెళ్ల‌ట‌మేన‌ని చెబుతున్నారు. పాల‌నా ప‌రంగా ఇలాంటి వాటిని స‌రి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.