Begin typing your search above and press return to search.

తెలంగాణా ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి ?

By:  Tupaki Desk   |   6 March 2022 2:51 AM GMT
తెలంగాణా ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి ?
X
తెలంగాణా ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసైలో అసంతృప్తి పెరిగిపోతోంది. తనలోని అసంతృప్తిని గవర్నర్ బహిరంగ ప్రకటన రూపంలో బయటపెట్టుకున్నారు. ఈ ప్రకటనలోనే కేసీయార్ ప్రభుత్వంపై గవర్నర్లో పెరిగిపోతున్న అసంతృప్తి స్పష్టంగా తెలిసిపోతోంది. ఇంతకీ గవర్నర్-కేసీయార్ మధ్య గ్యాప్ పెరిగిపోవటానికి, గవర్నర్ అసంతృప్తికి కారణం ఏమిటి ?

ఏమిటంటే సోమవారం నుండి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా మొదలవ్వబోతుండటమే. బడ్జెట్ సమావేశాల్లో ఆర్ధిక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ముందు ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు ఫైళ్ళను పంపింది. దీనికి గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. అయితే తర్వాత వచ్చిన ఓ ప్రకటనలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.

తన ప్రసంగంలేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవటం సంప్రదాయానికి విరుద్ధమని తమిళిసై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సాంకేతికంగా కేసీయార్ నిర్ణయం కరెక్టే అని మంత్రులు, ఉన్నతాధికారులు సమర్ధించుకుంటున్నారు. ఇదే సమయంలో గవర్నర్ తో పాటు బీజేపీ నేతలు కేసీయార్ నిర్ణయంపై మండిపోతున్నారు.

మొత్తంమీద తెలంగాణాలో కూడా గవర్నర్ కు ముఖ్యమంత్రికి వ్యవహారం చెడిందన్న విషయం అర్ధమైపోతోంది. ఇందులో భాగంగానే మేడారం జాతర ముగింపు కార్యక్రమానికి హాజరైనపుడు గవర్నర్ కు అవమానం జరగటం. కార్యక్రమానికి గవర్నర్ హాజరైనపుడు రిసీవ్ చేసుకోవాల్సిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు అడ్రస్సేలేరు.

ఇప్పటికే పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళలో గవర్నర్లకు రాష్ట్రప్రభుత్వాలకు ఏమాత్రం పడటంలేదు. వీళ్ళమధ్య తీవ్రస్ధాయిలో వివాదమే నడుస్తోంది. మరి తెలంగాణాలో గవర్నర్-సీఎం మధ్య వివాదం ఏ స్ధాయికి చేరుకుంటుందో చూడాలి.