Begin typing your search above and press return to search.

కరోనా సెకండ్ వేవ్ నియంత్రించడంలో ప్రభుత్వాలు ఫెయిల్

By:  Tupaki Desk   |   7 May 2021 7:00 PM IST
కరోనా సెకండ్ వేవ్ నియంత్రించడంలో ప్రభుత్వాలు ఫెయిల్
X
కరోనా సెకండ్ వేవ్ దేశఆన్ని కమ్మేసింది. వైరస్ ధాటికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముట్టుకుంటే అంటుకునే ఈ అంటువ్యాధికి ఇప్పుడు దేశంలోని చాలా మంది బాధితులుగా మారారు. వారిని ప్రభుత్వాలు రక్షించడం లేదు. వైద్య సదుపాయాలు కూడా కల్పించడం లేదు. అందుకే ఈ సెకండ్ వేవ్ కు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలే కారణమన్న అపవాదు పెరుగుతోంది.

కరోనా సెకండ్ వేవ్ నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దేశంలోని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. 61 శాతం ప్రజలు ప్రభుత్వాల తీరుపై కోపంగా.. అసంతృప్తిగా ఉన్నట్లు 'లోకల్ సర్కిల్స్' సర్వేలో వెల్లడైంది.

పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజల్లో ఉపాధిపై భయం పెరిగిందని తేలింది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు సరైన మార్గంలో వెళ్లట్లేదని 45శాతం మంది అభిప్రాయపడ్డారు.దీన్ని కరోనా వైఫల్యం ఖచ్చితంగా దేశంలోని కేంద్ర, రాష్ట్రాలదని చెప్పొచ్చు. మెజార్టీ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలపై గుర్రుగా ఉన్నారు. వారు చేయబట్టే ఈ దుస్థితికి దేశం దిగజారిందని భావిస్తున్నారు.