Begin typing your search above and press return to search.
పోర్న్ చూస్తేవారి తాట తీయనున్న ప్రభుత్వం .. సెర్చ్ హిస్టరీపై స్పెషల్ ఫోకస్ !
By: Tupaki Desk | 17 Feb 2021 8:00 AM ISTస్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం అందరి చేతుల్లో ఉండటం తో పోర్న్ చూసే వారి సంఖ్య కూడా రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతుంది. అయితే , ఇప్పటికే కేంద్రం దాదాపు 827 పోర్న్ సైట్లను భారత్ లో నిషేధించింది. అయితే ఈ నిషేధం పోర్న్ ను అడ్డుకోలేకపోయిందన్న వాదన ఉంది. పోర్న్‌ని నిషేధించడం అసలు పరిష్కారం కాదనే వాదన కూడా బలంగా ఉన్నది. దీనితో తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోర్న్ వీక్షణపై కొరడా ఝుళిపించేందుకు సిద్దమైంది. ఇకపై వ్యక్తుల ఇంటర్నెట్ సెర్చింగ్ డేటాపై నిఘా పెట్టనున్నట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు.
ఇకపై ఎవరైనా సెర్చ్ ఇంజిన్స్‌లో పోర్న్ వీడియోల కోసం సెర్చ్ చేస్తే... వెంటనే ఆ సమాచారం తమకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలా చేయడం ద్వారా వెంటనే ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పట్టుకుంటామని , దీనితో మహిళల పై జరిగే అఘాయిత్యాలని అడ్డుకోవచ్చు అని తెలిపింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ఇంటర్నెట్ సెర్చ్ డేటాపై నిఘా పెట్టేందుకు 'Oomuph' అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కేసులను డీల్ చేసేందుకు 'యూపీ విమెన్ పవర్‌లైన్ 1090' అనే కొత్త పోలీస్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనితో ఎవరైనా పోర్న్ కోసం సెర్చ్ చేయగానే మెసేజ్ వస్తుందని , ఆ వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారని అన్నారు.
సెర్చ్ ఇంజిన్ లో పోర్న్ సైట్ల కోసం వెతికేవారికి స్క్రీన్ పై ఒక అలర్ట్ కనిపిస్తుందని చెప్పారు. పోర్న్ సైట్లను వీక్షిస్తున్నవారి డేటా బేస్ ను రూపొందిస్తామని, వారు ఉంటున్న ప్రదేశాల్లో మహిళలపై నేరాలు జరిగినప్పుడు ఆ డేటా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టామని తెలిపారు. జనం నుంచి మంచి స్పందన వచ్చిందని... త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక్క యూపీలోనే 11.6మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని తెలిపారు.