Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకోండి కట్నం మేము ఇస్తామంటున్న ఆ దేశ ప్రభుత్వం !
By: Tupaki Desk | 24 Sept 2020 3:03 PM ISTజపాన్ లో ప్రభుత్వం తాజాగా సరికొత్త పథకం ప్రకటించింది. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ కానుకలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముందు అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేయండి, తరువాత నాలుగు లక్షలు తీసుకోండి అంటోంది అక్కడి సర్కారు. అయితే దీనికోసం మీరు జపాన్ లో మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మీకు నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా ఇదే నిజం. . రోజురోజుకూ తగ్గుతున్న జనాభా, ఆర్ధిక సమస్యల కారణంగా పెళ్లి చేసుకోవడానికి యువత నిరాకరిస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఎందుకంటే ఇలా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగితే జపాన్ లో కుటుంబ వ్యవస్థ నాశనం అయ్యే అవకాశం ఉంది. దీంతో దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న జంటకు అక్కడి ప్రభుత్వం నాలుగున్నర లక్షల బహుమతి ఇవ్వాలి అని నిర్ణయించిదట.జపాన్ లో వయస్సు పై బడ్డ వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ గా ఉంది. యువకుల సంఖ్య బాగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం పెళ్లి పై అక్కడ చాలా మందికి అయిష్టం పెరిగటం. పన్నెండు కోట్ల జనాభా ఉన్న జపాన్ లో కుటుంబ జీవితం ప్రారంభించాలి అనుకుంటున్న వారికి ఇలా గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది.
న్యూలీవెడ్స్ అండ్ న్యూ లైఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్’లో భాగం గా అక్కడ మున్సిపాలిటీల లో ఉండాలని నిర్ణయించుకునే జంటలకు వచ్చే ఏప్రిల్ నుంచి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. పెళ్లి చేసుకునేవారికి సుమారుగా రూ. 4,20,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అయితే , ఆయా జంటలకు వార్షిక ఆదాయం 5.4 మిలియన్ యెన్లు ఉండాలనే నిబంధనను పెట్టింది. కాగా, గతేడాది జపాన్‌లో 8.65 లక్షల మంది జన్మిస్తే.. 13 లక్షల మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే.