Begin typing your search above and press return to search.
రేప్ కేసుల్లో న్యాయం జరగడానికి పద్ధతి ఇదీ
By: Tupaki Desk | 6 Oct 2020 9:30 AM ISTఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో దళిత యువతిపై అత్యాచారం కలకలం రేపింది. దళితులు, కాంగ్రెస్, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ఏ అత్యాచారం కేసులోనైనా బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం లేదా అధికార యంత్రాంగం ప్రధానంగా మూడు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటిది లైంగిక దాడి సాక్ష్యాల కిట్స్ ను అందుబాటులోకి తీసుకురావడం.. కోర్టు ముందు నిలబడే తిరుగులేని సాక్ష్యాలను బాధితుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. వివిధ నమూనాలు, డీఎన్ఏలను సేకరించి సీల్డ్ బాక్సులో నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించే ప్రత్యేకమైన కిట్లను అందుబాటులోకి తీసుకురావడం పోలీసులు చేయాలి.
నిర్భయ ఘటన తర్వాత ‘సెక్సువల్ అసాల్ట్ ఫోరెన్సిక్ ఎవిడేన్స్ లేదా సేవ్’ కిట్లను సేకరించాలని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
2019 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేవలం దేశంలో 9 రాష్ట్రాలు మాత్రమే కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేశాయి. సేఫ్ కిట్లను సేకరించాయి. భారత్ లో దేశవ్యాప్తంగా 3120 సేఫ్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో అయితే లక్షల్లో ఉన్నాయి.
అయితే దళిత యువతి రేప్ కేసులో సేఫ్ కిట్లను ఉపయోగించినట్లయితే సాక్ష్యాధారాలను తారుమరు చేశారన్న ఆరోపణలు వచ్చేవి కావు.. అనుమానాలు కూడా వ్యక్తం అయ్యేవి కావు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు సేఫ్ కిట్లతో పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను భద్రంగా ఉంచాలి.
హత్రాస్ బాధితురాలిపై హత్యాచారం విషయంలో పోలీసులు ఒక్కరోజులోనే అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని కాల్చేశారు. దీంతో ఫోరెన్సిక్ పరీక్షలు చేసే వీలు లేకుండాపోయింది. ఇదే ఇప్పుడు అనుమానాలకు దారితీసింది.